పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కున్న కళాకారులు రంగ స్థలం మధ్య కనిపిస్తారు. అడుగు ముందుకు వేసేటప్పుడు మొదటి కుడి పాదం వేసి ఆ తరువాత ఎడమ పాదాన్ని కుడి పాదం మడమ దాకా ముందుకు తీసుకు వస్తారు. ఆ విధంగా మళ్ళీ కుడి పాదంతో అడుగు వేయడానికీ వీలు కలుగు తుంది. ఈ నృత్యం వాయించే రెండు రకాల చర్మ వాద్యాలూ అడుగులు వేసేటప్పుడు లయ బద్ధంగా చేయడానికి తోడ్పడుతాయి.

వాయిద్యాలను మరింత వేగంగా వాయించిన కొలది నాట్యంలో ఉత్సాహం కూడ పెరిగి మరింత చురుకుగా సాగుతుంది. అర్థరాత్రిలోగా విందులు ముగించి, స్త్రీలూ, పురుషులూ పిల్లలూ మళ్ళీ నృత్యం ప్రారంభిస్తారు.

ముత్యాలమ్మనూ, కొండ దేవతలనూ ఆహ్వానిస్తూ సుదీర్ఘమైన పాటలు పాడుతారు. కొండ రెడ్లకు ఈ పాట ఎంతో ఉత్సాహాన్నీ ఉద్వేగాన్ని కలిగిస్తుంది.

సన్నివేశం పతాక స్థాయిని అందుకునే సమయానికి పాట పూర్తి అవుతుంది. ఉదయం పది గంటల వరకూ, అలసట వచ్చేంత వరకూ నృత్యంచేసి ఎవరికి వారు వెళ్ళి పోతారు. గ్రామ మంతా నిశ్శబ్దమైపోతుంది.

మూఢ నమ్మకాలు:

వ్యాధులూ, మరణమూ, వృద్ధాప్యం మొదలైనవి, దైవాను గ్రహం, చేతబడి, మంత్ర తంత్రాల వల్ల వస్తాయని వీరికి గట్టి నమ్మకం. అందుకే జంతువులను విపరీతంగా దేవతలకు బలి ఇస్తారు. వీరిలో నిర్భంధంగా స్రీని ఎత్తుకు వచ్చి వివాహం చేసుకునే పద్దతి ఇప్పటికీ వుంది. పెళ్ళిళ్ళకు స్త్రీ పురుషులు సాంప్రదాయ నృత్య గానాలు చేస్తారు. రాజుల పండుగా, గంగాలమ్మ పండుగా, గూపెమ్మ కొలువులలో వీరు దేవతలను ఆహ్వానిస్తూ నాట్యం చేస్తారు. రాజుల పండుగల్లో వారు పాండవులను ఆహ్వానిస్తారు.

రాజుల పండుగలో
లేలేలేల లేలెమ్మరో ఓ లేల
లేలేలేల లేలెమ్మరో ఓ లేల

అన్న రీతీలోనూ


పెళ్ళిళ్ళలో

లచ్చు కొడలయ్య కోడలా
లచ్చీర బాల కోడలా