పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మామిడి కోత నృత్యం:

కొండ రెడ్లకు అత్యంత ప్రీతి కరమైనవి మామిడి పండ్లు. మామిడి పండ్లు ఆ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. మామిడి పండ్లు కోసే ముందు కొండ రెడ్లు ఆనందోత్సవం జరుపు కొంటారు. తప్పెట్ల వాయిద్యాల శబ్దానికి అనుగుణంగా లయ బద్ధమైన నృత్య చేస్తారు.

రాత్రి పూట ఈ నృత్యం ప్రారంభ మౌతుంది. మొదట వాయిద్యాలను నెమ్మదిగా మ్రోగిస్తారు. ముగ్గురు నలుగురు స్త్రీలు చెట్టపట్టలు వేసుకుని చేతుల్లో గల గల శబ్దం చేసే ఎండు కాయల గుత్తులను ధరించి నృత్యంలో పాల్గొంటారు.

సామూహిక నృత్యం:

వారు చేసే నృత్యంలో స్త్రీలూ, పురుషులూ ఒకే సారి నృత్యంలో పాల్గొంటారు కాని జంటలుగా కలవరు. రంగ స్థలం చుట్టు ఎడమ చేతి వాలుగా ప్రదక్షిణం చేస్తూ నృత్యం కొనసాగిస్తారు. నృత్యం పతాక సన్నివేశానికి వచ్చినప్పుడు సైతం స్త్రీలు పురుషులూ వేరు వేరుగానే నృత్యం చేస్తారు. స్త్రీలు పాదాన్ని నేలకు తాకించుతూనే నాలుగు అడుగులు ముందుకు వేస్తారు. ఇలా ముందుకు వెళ్ళడం ఒక ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. కుడి పాదాన్ని ఐ మూలగా నాలుగడుగులు ముందుకు వేసి,నొక అడుగు అదే పద్ధతిని వెనక్కు వేస్తారు. వలయాకారంలో చేరి ఒకే సారి అందరూ కేంద్ర స్థానానికి వచ్చి మళ్ళీ పోవడం, చేతులు ఊపుతూ అర చేతుల్లో వున్న గలగలలాడే వాయిద్య విశేషాలతో శబ్దం చేయడం ఈ నృత్యానికి హంగును చేకూర్చుతుంది. కాళ్ళను ఎడంగా వుంచి కుడి పాదం మీద అదేలా దూకడం, అటు తర్వాత కుడి పాదం వెనక్కూ ఎడం పాదం ముందుకూ వచ్చేటట్టు మరో గెంతు గెంటడం కూడ ఒక విశిష్టమైన నర్తన విధానం.

పురుషుల నృత్యం:

పురుషుడు అడుగులు చేసే పద్ధతి స్త్రీల కంటే భిన్నంగావుంటుంది. నాట్యం చేస్తున్న బృందం తో పాటు వాద్య కారులు ప్రక్కగా వెంట వెంటనే ముందుకు అడుగులు వేస్తారు. ప్రారంభంలో మట్టుకు వాయిద్యాలను పట్టు