పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధరించి వచ్చే గుసాడీల చేతుల్లో కర్ర లుంటాయి. మెడలో గవ్వల హారాలూ, తుంగ కాయల హారాలూ వుంటాయి. నడుముకు మణి కట్టుకూ - చిరు గజ్జెలు వుంటాయి. కంటి చుట్టూ తెల్ల రంగు పూసు

కుంటారు. మొలకు నారింజ రంగు లంగోటీలు తప్పించితే శరీరం పై మరే ఇతర అచ్ఛాదన ఉండని గుసాడీల వేషం వింతగా వుంటుంది. శరీరం పైన నలుపు చారల చుక్కలతో ఇంత వింత అలంకరణాలు వుంటాయి. గుసాడీలు ప్రవేశించ గానే దండారీలు చెల్లా చెదురౌతారు. ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది.