పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రవేశిక నృత్యం చేస్తూ వుంది. మరో నర్తకి అలీడ స్థానంలో వుండి వ్యంసిత కరణాన్ని చుపుతూ వుంది. వేరో నర్తకి అర్థమత్తిల్లి స్థానంలో వుండి స్థలితాపశ్యత కరణాన్ని చూపూతూ వుంది.

TeluguVariJanapadaKalarupalu.djvu

మరొక శిల్పంలో ఆరుగురు నర్తకీ మణులు ఒక రాజు ముందు నృత్యం చేస్తున్నట్లు చూప బడింది.

భోదిసత్వుడు తెల్ల ఏనుగు రూపంలో భూమికి వచ్చే ఘట్టాన్ని చూపే శిల్పంలో ఆయనను అనుసరించి వచ్చే దేవతల బృందం వివిధ నాట్య భంగిమలలో కనిపిస్తున్నారని దిగవల్లి శివరావు గారు తమ 'కథలు -గాథల 'లో తెలియ జేశారు.

లలితవిస్తరం చెప్పిన లలిత కళలు:

బౌద్ధయుగంలో అనేకమైన రూపకాలు వెలిశాయి. బుద్ధుడు మొట్ట మొదటి నాట్యశాస్త్ర వేత్త అని బుద్ధుని తొలి జీవిత చరిత్ర 'లలిత విస్తరం' లో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. బుద్ధుడు తన రాజ గృహంలో విశ్రమించి నప్పుడు ఆయన శిష్యులైన మౌద్గల్యాయనుడు, ఉపతిష్కుడూ తమ నటనా కౌశల్యాన్ని చూపించారట. బింబిసారుని ఆస్థానానికి నాగరాజులు వచ్చినప్పుడు వారి గౌరవార్థం నాటకాలు ప్రదర్శించారట, రాజగృహంలో బుద్ధుని సమక్షంలో దక్షిణ దేశానికి సంబందించిన కువలయ అనే ప్రసిద్ధ నర్తకకురాలు బుద్ధుని జీవితాన్నే అభినయించిందట. బౌద్ధజాతక కథలలో నటులను గురించి కావలసినంత సమాచారం తెలుస్తూంది. పై వివరాలను బట్టి బౌద్ధ యుగంలో నాటక కళ ఎలా అభివృద్ధి అయిందీ సూక్ష్మంగా తెలుసుకోవచ్చును.

శాతవాహన రాజ్యవైభవం క్రీ.శ. 200 తో అంతరించింది. 400 సంవత్సరాల ఆ పరిపాలనలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖన ఎంతగానో ఆభివృద్ధి పొందాయి.

ఇక్ష్వాకులు చెక్కిన చక్కని శిల్పాలు:

శాతవాహన రాజ్యం చిన్నాభిన్నమైన తరువాత ఇక్ష్వాకు రాజులు పరిపాలించారు. ఈ వంశంలో ముగ్గురు రాజులు 52 సంవత్సరాలు మాత్రమే రాజ్య పారిపాలన చేశారు. వాసిష్టీ పుత్ర శాంతమాలుడు ఈ వంశకర్త. ఈయన కుమారుడు మాఠరీ పుత్ర