Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాజంలో వీరిని హీన జాతిగా పరిగణించినా, అగ్ర కులాల్లోలేని విలక్షణమైన ఆచారాలు వీరి కున్నాయంటారు. అవి చిందుల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ తెలుస్తుంది వీరి చరిత్రం. దీనిని ఆది ఆంధ్ర కర్ణాటక సంస్కృతిగా గుర్తించ వచ్చు. దక్షిణ దేశంలో శాక్తేయ మతం అనవచ్చు.

గ్రామ దేవత, పెద్ద స్వామి:

గ్రామాలలో వర్షాలు కురవనప్పుడూ, కలరా, మశూచి మొదలైన అమ్మవారు సోకినప్పుడూ, పల్లెలలో ఆసాదుల చిందులు ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరమూ ఉగాది మరుసటి రోజున గ్రామ దేవత పెద్ద స్వామికి మేలుకొలుపు పాటలతో చిందు నృత్యాలు ఆవేశంగా గేయాలు పాడతారు.

పౌర్ణమి రోజున పెద్ద స్వామిని, కాపుల ఇళ్ళ దగ్గరకు తీసుకు వచ్చి బలి ఇవ్వబోయే పోతునూ, బోన కుండను, గంట దుత్తను ఆసాదుల చిందులతో గుడి దగ్గరకు వచ్చి తమ జవనికల్ని ఉధృతంగా వాయిస్తూ, కాపుల పూర్వీకు లందరినీ పేరుపేరునా స్తుతిస్తారు. గుడి దగ్గరకు వచ్చిన కుమ్మరి పూజారి కాపుల వస్తువుల నన్నిటినీ అక్కడ పెట్టి గ్రామ ప్రజల ముందు చిందులు వేస్తాడు.


ఆసాదుల బృంద నృత్యం:

సామాన్యంగా ఆసాదుల బృందంలో ముగ్గురుంటారు. అందరి వద్దా వాయిద్యాలు వుంటాయి. ప్రధాన నాయకుడు పాడితే మిగతా ఇద్దరూ చిందులు వేస్తూ