పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/483

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పెద్ద కఱ్ఱ వుంటుంది. సుద్ధులు మనకు తేలికగా అగుపించినా అందులోనే మనకు వేమనగారు పద్యాల్లో వున్నంత అర్థ స్ఫూర్తీ, తర్కమూ సిద్ధాంత సమన్వయంతో ద్వంద్వాత్మకంగా వుంటాయి.

గొల్ల కలాపం:

సుద్దులకూ గొల్ల కలాపానికి సంబంధం లేక పోయినా, గొల్ల కలాప ప్రాముఖ్యంతో యాదవుల గొప్ప తనాన్ని తర్కంతో నిరూపిస్తారు. అయితే కూచిపూడి వారూ, మారంపల్లి దేవదాసీలూ ప్రదర్శించే గొల్లకలాప ఇతి వృతానికీ దీనికీ సంబంధం లేదు. గొల్ల కలాపం కులవ్వవస్థమీద తిరుగుబాటు, అ తిరుగుబాటుకు పురాణాలనే ఆయుధంగా త్రిప్పుతారు.

కలాపాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు. యాదవుని గోవులు కాచిన మాధవుడు యాదవుడే కదా? ఆ మాధవుడు పాలకడిలో యోగ నిద్రలో వున్నప్పుడు అతని నాభి కమలంలో పుట్టిన బ్ర్ఫహ్మ ఎవడు? యాదవుడే కదా? ఆ బ్రహ్మ ముఖం నుండి పుట్టి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు పుట్టిన క్షత్రియులు వగైరా ఎవరు? యాదవులే కదా? అందుకని ఈ మనుషులందరిదీ ఒకటే కులం, ఒకటే కులం, యాదవ కులంలో అందరూ ఎఱ్ఱ గొల్లలే అని పురాణ తర్కంలో సిద్ధాంతీకరిస్తారు.

యాదవుల కళా రూపాలు:

తెలంగాణా యాదవుల్లో కథలు చెప్పేవారు రెండు మూడు రకాలుగా వున్నారు. పురుషుడు ఆడ వేషం వేసుకుని కాళ్ళకు గజ్జెలు కట్టి ఒగ్గు చేత బట్టి, పెద్ద డోలుతో పెద్ద తాళాలతో, వంతల సహాయంతో నృత్యం చేస్తూ కథను ముగిస్తాడు. వీరు ముఖ్యంగా "బల్ గురి కొండయ్య" కథ చెపుతారు. మరి కొంత మంది వృద్ధులైన కథకులు ఎల్లమ్మ కథను చెపుతూ జీవిస్తారు.

ఇల యాదవుల్లో కుర్మోళ్ళు అనే మరో తెగవారు వీరన్న కథ చెపుతారు.

వీరుగాక గొల్ల భాగోతులు అనేవారు వేరేవారున్నారుల్. వీ డాంజ్ఞియా, చంద్ర కాంత, మాంధాత, చిరుతొండ, విప్రనారాయణ లాంటి వీథి నాటకాలు ఆడతారు.