- నగ్న నృత్యాలు:
రేణుకాదేవి జమదగ్ని మహముని భార్య, పరశురాముని తల్లి, తండ్రి ఆజ్ఞను అనుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా తలకాయ మాదిగవాడలో పడిందట. శిరస్సు లేకుండా వున్న విగ్రహం ముందు నగ్న నృత్యంతో పూజిస్తూ వుండేవారట. నగ్నంగావున్న ఈ విగ్రహాల ముందు స్త్రీలు కూడా నగ్నంగా పూజిస్తూ నాట్యం చేస్తూ వుండేవారట. ఈ నృత్యాలలో జవనికల వాయిద్యం వుత్తేజాన్ని కలిగించేదట.
- నాడూ, నేడూ:
చారిత్రాత్మకమైన ఈ జముకుల కథలే, ఆనాటి జక్కుల కథలు, ఈ కథలు ఈ నాటికీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోనూ, తెలంగాణా లోనూ, విశేష ప్రచారంలో వున్నాయి. ఈ కథలు శృంగార లాలిత్యం తోనూ కరుణ రసాన్ని ప్రతిబింబించేవి గానూ వుంటాయి. ఈ కథల్లో అనేక రకాలైన సంగీత పట్టులున్నాయి. మట్టులకు తగినట్లు వాయిద్యాలు మలుపు తిరుగుతాయి. ఈ ప్రదర్శనం మూడు గంటల కాలం నడుస్తుంది.
- బుడికి పాట:
శ్రీకాకుళం జిల్లాలో నేటి జముకుల కథ పూర్వ నామం బుడికి, లేక బుణికి పాట అనీ, బోనుల పాట అనీ టమకటమా అనీ, బుడబుక్కల పాటనీ నామాంతరాలని ( ప్రజాసాహితి ప్రజాకళా రూపాల ప్రత్యేక సంచికలో ) ఛాయారాజు గారు ఉదహరించారు.
బుడికి వాయిద్యాన్నే "బోను" అని కూడ అంటారట. అందుకే అది బోనుల పాట అయింది. బుడికి చేసే శబ్ధం ...బుడుక్కు, బుడుక్కు కాబట్టి బుడబుక్కల పాట అని కూడా అంటారు. మొత్తం మీద ఇది వాద్య ప్రధానమైన కళారూపం.
- జముకుల, వన్నె చిన్నెలు:
జముకులంటే ఈ తరానికి చాల మందికి తెలియదు, దీనినే ... జమిలిక, జమిడిక, బుడికి, అని కూడ పిలుస్తారు. ఈ వాయిద్యం కుంచం ఆకారంలో