పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/456

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వుంటుంది. కొన్ని ఇత్తడి తోనూ, మరి కొన్ని కొయ్యవి కూడ వుంటాయి. దానిని ఒక ప్రక్క భాగం సన్నని పొరలాంటి గేదెల బక్కీ చర్మంతో మూస్తారు. మధ్య భాగంలో చిన్న రంధ్రం చేసి నరాన్ని కట్టి లోపలి భాగం నుంచి రెండవ ప్రక్క ఒక కర్ర ముక్కకు కట్టి చేతితో దానిని లాగి పట్టి లోపలి భాగంలో ఆ నరాన్ని మోగించి నట్లయితే శ్రావ్యమైన మోతలు వస్తాయి.

రంగస్థల వేషాలు, విశేషాలు.

జముకుల కథా ప్రదర్శనానికి ఏ విధమైన రంగస్థలమూ అవసరంలేదు. గ్రామం మధ్యలో చిన్న పందిరి వేసి, రెండు లైట్లు కడితే సరిపోతుంది. ప్రదర్శన కారులు ముగ్గురు. అందులో మధ్య వ్వక్తి కథకుడు, వంత దారుల్లో ఒకరు హాస్యం, రెండవవారు వ్వాఖ్యానం, వేషధారణలో కథకుడు నల్ల కోటు, తెల్లకట్టు పంచ, తల గుడ్డ చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియ దిరుగుతాడు. స్త్రీ పాత్రలు, కథా విధానంలో వచ్చి నప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్నే కథకుడు చేస్తూ వుంటాడు. వంత దారులు రెండు జముకలను శ్రావ్వంగా వాయిస్తూ వుంటారు.

బుడికి కథా ప్రదర్శనం:

శ్రీకాకుళం జిల్లాలో ప్రచారంలో వున్న, జముకుల కథకు ప్రత్యామ్నాయ మైన బుడికి కథా రూపంలో పాల్కొనే వారు ముగ్గురుంటారు. రెండు బుడికెలు (అవే జముకులు) కాళ్ళకు గజ్జెలు తప్ప మరే ఇతర వాయిదాలూ వుండవు.

ఈ ముగ్గురులో మధ్యనుండే పాట గాడు స్త్రీ పాత్రలో, అంటే భామాకలాపంలో సత్య భామ వేషం మాదిరి వుంటుంది. వంత పాట దారులకు ప్రత్యేక వేష ధారణేమీ వుండదు. వీరిద్దరూ బుడికెలను చంకలకు తగిలించుకుని లయ బద్ధంగా, పాటల ననుసరించి వరుసలు మారుస్తూ వాయిద్యాన్ని సాగిస్తారు.

చేతిలో రుమాలు:

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కథకుని చేతిలో వుండే పట్టు రుమాలు. కథకు ప్రాణం కథకుడైతే, కథకుని ప్రాణం చేతిలోని పట్టు సెల్లాయే. అది ఎంత ముఖ్య మైనదో చాయారాజ్ గారు ఈ క్రింది ఉదాహరణను ఉదహరించారు.