పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొరగ పడుచుల గొండ్లి నృత్యం


వీరు మైలార దేవర వీర భటుల
గొండ్లి యాడించు చున్నారు
గొరగ పడుచు నాడుచున్నది
చూడు మూర్థాభి నయము
తాను నెట్టి క శీలంత గాని లేదు.. ( క్రీడాభిరామం)

కాకతీయుల కాలంలో గొండ్లి అనే కుండలాకార నృత్యం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మల వుత్సవాల సమయాల్లో పిల్లన గ్రోవు లూదుతూ, ఆటలు, ఆడుతూ కుండలాకార నృత్యాలు చేసినట్లు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి గొండ్లి నృత్యాలు అనాదిగా మన సంస్కృతితో సంబంధమున్నట్లు తెలుసు కోవచ్చును.

భిన్నాభిప్రాయాలు:

గొండ్లి నృత్యాన్ని గూర్చి పండితుల్లో వివిధ అభిప్రాయలున్నట్లు నాటరాజ రామకృష్ణగారు జానపద కళల ప్రత్యేక సంచికలో వివరించారు.

గొండ్లి అనేది కుండలాకారంగా చేయబడే నృత్యమనీ, అది కుండలి నృత్యమనీ కొందరు పండితుల అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే నందికేశుడు తన భరతార్ణవంలో శుద్ధ, దేసి, పేరిణి, ప్రేంకణం, కుండలి, దండిక, కలశములనే సప్త దేశి తాండవ రీతుల్ని గూర్చి వివరించాడు.

అందులో "కుండలి" నృత్యాన్ని గురించి పరిశోధించినట్లైతే అది శాస్త్రీయ కరణాంగహార చారీ భేదాలతో కూడిన నృత్యంగా తెలుస్తూంది. అంతే గాక అది