పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రీ కొడుకుల్ సల్ గుండాలి॥అల్లాకే నాం॥
హిండు ముస్లింలంతా ॥అల్లాకే నాం॥
వారు హేకం కాలాలండి ॥అల్లాకే నాం॥

అంటూ పాడుతూ, మద్ఖ మధ్య రక్తి కోసం కర్రతో చేయ బడ్డ ఒక విధమైన కిర్రు శబ్దం వచ్చే దానిని చేతిలో ధరిస్తారు. కాలేజీ హైస్కూలు విద్యార్థులు వారి వారి స్కూలు వుత్సవాల్లో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ

వుంటారు. ఈ కళా రూపాన్ని ఆంధ్ర ప్రజా నాట్య మండలి హిందూ ముస్లిం మత సామరస్యం కొరకు వినియోగించి ఆంధ్ర ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు.