పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/415

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వేళ నుంచి, సరిపొద్దు మీరే దాకా జట్టి జాము లేస్తారు. చిన్నతనం నుంచీ అమ్మమ్మల ద్వారా, అమ్మల ద్వారా విన్న పాటలు అందరికీ కంఠోపాఠమై లయ బద్ధంగా సాగి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ అటలో పాల్గొనేవారు నలుగురు గానీ, అంతకు మించి సరి సంఖ్యలో గాని వుంటారు. సరిసంఖ్యలో నున్న వారొక జట్టైతే, బేసి సఖ్యలో వున్నవారందరూ ఒక జట్టు. ఇరు జట్టుల వారూ కలిసి గుండ్రంగా నిలబడతారు. మిగిలిన వారంతా ప్రేక్షకులుగా నిలబడతారు. ఒక జట్టువారు ఒక పాదాన్ని పాడితే రెండవ జట్టువారు వంత పాడతారు. ప్రతి సారీ పూర్వ పాదాన్ని తిప్పి తిప్పి పాడుతారు. అన్నీ పాదాల్నీ అలాగే పాడి,పాదాంతంలో చివర "తుమ్మెదా, నడియలో, వెన్నిదాయలో, విన్నెలాయలో, రామా కోదండరామా, రామాంజనా స్వామీ శ్రీ రామా నారాయణా" అని కంఠాలు కలుపుతారు.

ప్రేమ కలాపాలు

ఈ పాటల్లో, కథలూ,గాధలూ, ప్రేయసీ ప్రియుల ప్రేమ కలాపాలు మొదలైన సాంఘిక గాథలూ, పారాణిక చారిత్రిక గాథలూ వుంటాయి. అందుకు అనుకూలంగా దోణప్పగారు ఎన్నో గాధల్ని పాటల రూపంలో చెప్పారు. ఉదాహరణకు ఈ చిన్న సన్నివేశం వినండి.

ఎక్కడికో దూర దేశానికి పోయిన తన భర్త తలవని తలంపుగా తిరిగి వచ్చిన సంగతి తెలుసుకుని ఆ మధురానుభూతిలో ప్రొద్దు తెలియలేదు. ఆమె తోడి కోడలు ఆమె కంటే ముందే మేలుకుని, రాజనాలు వండుతూ వుండి. తల ఎత్తి చూసేసరికి తోడికోడలు వరుసకు చెల్లెలు కన్నులకు కాటుకా, కొప్పున పూలూ, చెక్కిళ్ళకు గంధమూ చూసిన అక్కకి ఆశ్చ్యర్యమేసింది.

TeluguVariJanapadaKalarupalu.djvu

భర్త ఊరిలో లేని సమయంలో ఇల్లాలు అలంకారాలు ఏమీ లేక, ఆర్థ పస్తులతో వెళ్ళబుచ్చ వలసిన సతికీ ఈ సింగారింపేమిటి? ఆన్నట్లు చూసిన పెద్ద కోడలికి మఱది వచ్చిన వార్త ఈ విధంగా తెలిపింది.