పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జట్టి జాములో చేతులు చరచటం, అంటే చప్పట్లు లాంటివి వుంటాయి. నిటారుగా నిలబడి ఉభయ పార్శ్వాల్లో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండ ఒక సారి కుడి ప్రక్కకూ, ఆ వెంటనే ఎడమ ప్రక్కకు పార్శ్వముఖ భంగిమలో ఓరగా తిరిగి ఆయా వేపుల వుండేవారి అరచేతుల్ని తన చేతులతో తట్టుతూ పాడుతూ ప్రదర్శించేది జట్టి జాము.

స్త్రీల కళారూపం:

ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన ఆట. ప్రప్రథమంలో చేతి కోలల్ని ఉపయోగించినట్లు ఊహించవచ్చు. సంస్కృతంలో చేతి కోలలని అర్థమిచ్చే "యష్టి" ప్రాకృతంలో జామ అంటారనీ అందుకు ఉదాహరణగా, జట్టి జాము పాటల్లో "వెన్నెలాయలో ... వెన్నిదాయలో " వెన్నిటీ అనే పాదాలుంటా యనీ ఆర్వియస్ సుందరంగారు జానపద విజ్ఞానంలో వివరించారు.

జట్టి జామును, చైత్ర వైశాఖ కార్తీక మార్గ శిరాలు ఈ పాటలకు ఋతువులు జట్టి జాములో నలుగురు గాని, అంతకు ఎక్కువైతే సరిసంఖ్యల లో గాని పాల్గొంటారు. వీరు రెండు జట్లుగా వుంటారు. ఒక జట్టు వారు పాటలో ఒక పదాన్ని పాడితే, రెండవ జట్టు వారు వంత పాడుతూ వుంటారు. "తుమ్మెదా","నడియలో" వెన్నిటీ, రామ రామ, కోదండ రామా వంటి పల్లవులు జట్టి జాములో కనిపిస్తాయి. జట్టి జామనే పేరుగల ఈ కళారూపం ఈ పేరున ఆంధ్ర దేశంలో మరెక్కడా కనిపించదు.

నలుగురూ చేరి నవ్వుకుంటారు:

రాయలసీమ పల్లెల్లో ఈ జట్టి జాము వేయాలని నిర్ణయించుకున్న రోజున అమ్మ లక్కలు వెంట వెంటనే వంటలను ముగించుకుని, ఇంటిలో అందరికీ ఆన్నం పెట్టి, పిల్లల్ని నిద్ర పుచ్చి నలుగురూ ఒకే చోట చేరుతారు. అందరికీ అనుకూలంగా వుండే వారింటి ముందు ఇలా స్త్రీలందరు చేరితే అదొక అలంకారం. ఇంటి పనుల్లో సతమతమై పోయి, ఆ కాసేపూ వాటన్నిటినీ మరిచి పోయి, సంసారంలో వున్న చిక్కుల్నీ, చిరాకుల్నీ పార ద్రోలి అందరూ హాయిగా గడుపుతారు.

చైత్ర వైశాఖ మాసాల్లోనూ, కార్తీక మార్గ శిర మాసాల్లోనూ, ఈ పాటలు పాడు కోవటానికి అనువైన ఋతువులు, పొద్దు కూకిన తరువాత నాలుగైదు ఘడియల