పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/408

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu

మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు

గాలపు సిడి అతి ప్రాచీనమైనది. తరతరాలుగా భారత దేశంలో ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి వహించి నటువంటిది. గాలపు సిడి వుత్సవం, జాతరల లోనూ, అమ్మవారి మొక్కు బడుల లోనూ, తిరునాళ్ళలోనూ ప్రాముఖ్యం వహించినా, గాలపు సిడి వుత్సవంలో, పాడే పాటలూ, ఆడే ఆటలూ, నృత్యాలూ, సాము గరిడీలూ, వీరణ వాయిద్యాలూ, కొమ్ము బూరల కోలాహలం కళా రూపాలను ప్రదర్శిస్తారు. ఎంతో ఆసక్తితో ప్రజలు వీటిని తిలకిస్తారు.

ఈ నాటికీ ఆంధ్ర దేశంలో, సూళ్ళూరు పేట మొదలైన చోట్లా, తమిళ నాడులో కొన్ని చోట్లా ఈ ప్రదర్శనాలు మరో రూపంలో జరుగు తున్నాయి.

గాలపు సిడి:

వారి వారి నమ్మకాల ప్రకారం, సిడి తిరుగుతా మని మొక్కు కున్న వారికి సంబంధించింది ఈ గాలపు సిడి.

సిడి మ్రాను కొయ్య అనేది, సిడుల జాతర కోసం, అమ్మవారో లేక వారు నమ్ముకున్న మరో దేవతో ఆ ఆలయాల ముందు నాటిన స్థంభం.

మ్రొక్కుకున్న వారి వీపులో నుంచి ఇనుప గాలమును గుచ్చి, సిడి మ్రాను కొయ్యకు కట్టి తిప్పేవారు. దీనిని గాలపు సిడి అనేవారు.

గంప సిడి:

పై విధానాన్ని కొనసాగించ లేని వారిని గంపలో కూర్చుండ బెట్టి, అలాగే త్రిప్పే విధానాన్ని "గంప సిడి" అనేవి కూడా ఒకటి వుండేది. సిడి అంటే మొద్దు లాంటి ఈటి అని బ్రౌణ్య నిఘంటువులో ఉదహరింపబడింది.