పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడుమ ఎత్తైన కుర్చీలూ, కుర్చీలపైన బనారస్ తాపితాలు పరచి వాటిపై వధూవరులు కూర్చుంటారు. పెళ్ళి కొడుక్కి కుచ్చుల తలపాగా లేక రుమాలు, తలపాగా పైన కలికి తురాయి బాసికం, చేతిలో డిబాకు, మెడలో చంద్ర హారాలు, పూదండలు, ముంజేతికి కంకణాలు, సిల్కు దుస్తులు, పెళ్ళి కూతురుకు పూల జడ, మేలిముసుగు, బాజు బందులు, మెడలో కాసుల పేరు, రవ్వదుద్దులు, చెంపసరాలు, బుగ్గ కాటుక బొట్టు, పాపటబిళ్ళలు, జడ కుచ్చులు, రవ్వల ఒడ్డాణం, నుదుత బాసికం, జిగేల్మనిపించే బనారసు పట్టు చీరె రవికె.

ఊరేగింపు ఉత్సాహం:

వధూవరుల కుర్చీలకు ముందు వెనకా బండి నిండా పెళ్ళివారి పిల్లలు, బండి తోలేవాడి వేషం వేరు. బండికిముందూ వెనుకా రెండు ప్రక్కలా పెట్రోమాక్సు లైట్లు ఎత్తి పట్టుకునే మనుషులు ఊరేగింపు ముందు బాగాన దివ్వేటీలూ, బాణాసంచా కాల్పులూ, బండికి నాలుగు ప్రక్కలా ఉభయ పక్షాలవారి అడా, మగా పెళ్ళి వారి ఊరేగింపును చూడ దానికి వచ్చిన ఊరి జనం వీథుల నిండ మేడ మెద్దెల నిండా తొడ తొక్కిడిగా వుంటారు.

బండికి ముందు పురుషులూ, వెనక స్త్రీలూ, నడవడం మామూలు. బండికి ముందు నడుస్తున్న పురుషుల గుంపునకు ముందు వాద్య కారుల బృందం ప్రత్యేక దుస్తులు ధరించి వుంటారు. ముఖ్యమైన కూడలి స్థలాలలో బండి ఆపి నప్పుడు, మేళ నాయకుడు వధూవరుల కభిముఖంగా తిరిగి మెరవణి గద్దెను ఆశువుగా పఠిస్తాడు.

ఆసాది, కొరిచె:

ఆసాది కొరిచె తెగల వారు వాయిద్యాలను వాయించే విద్యను నేర్చుకున్నట్లే మెరవణీ విద్యను కూడా నేర్చుకున్నారు. మెరవణి గద్య పొడిగింపు అతి సుంద