Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాసుగారు బొబ్బిలి వాస్తవ్యుడైన వాసా సాంబయ్య వద్ద కొంతకాలం వీణ నేర్చుకున్నారు. తరువాత విజయనగరం మహారాజావారి కాలేజీలో యఫ్.ఏ. వరకూ చదివి తరువాత ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పారు.

దాసుగారు ప్రప్రథమంగా యక్షగానాలను తరువాత హరికథా ప్రబంధాలను రచించారు. షేక్స్ పియర్, కాళిదాసు గ్రంధాలను అనువాదం చేశారు. వీణా వాదన లోనూ, నృత్య సంగీతాల్లోనూ అసమానమైన ప్రజ్ఞను సంపాదించారు. లయలో ఈయన సామర్థ్యం సాటిలేనిది. చల్లపల్లి జమీందారు గారిచే గజయాన, గండపెండేర సత్కారాన్ని పొందారు.

దర్బారుల్లో దర్జాగా సన్మానాలు:

పిఠాపురం, ఏలూరు, విజయవాడ, బళ్ళారి, మద్రాసు నగరాల్లో హరికథా ప్రదర్శనాలనిస్తూ అనేక సంస్థానాల్లో సత్కారాల నందుకున్నారు. బెంగుళూరులో తన హరికథా కథన ప్రజ్ఞను ప్రదర్శించి మైసూరు మహారాజా దర్బారున కాహ్వానింపబడి గొప్ప సన్మానాన్ని పొందారు.

ఈ విధంగా అన్య ప్రాంతాల్లో సన్మానాల నందుకున్న దాసుగారి కీర్తిని గుర్తించిన ఆనంద గజపతి మహారాజు దాసుగారిని అహ్వానించి దర్బారు పండితుణ్ణిగా చేసారు. ఆనంద గజపతి మరాణానంతరం దాసు మరల ఆంధ్రదేశ మంతటా హరికథ ప్రదర్శనాలిచ్చారు.

1919 వ సంవత్సరంలో ఆనాటి విజయనగర సంస్థానాధీశ్వరుడు శ్రీ విజయరామ గణపతి సంగీత పాఠశాల నొకదానిని స్థాపించి దానికి ఈయనను అధ్యక్షులుగా నియమించారు. ఈ పదవిలో ఆయన 17 సంవత్సరాలు పని చేశారు. 1936 లో ఉద్యోగాన్ని వదిలి వేశారు. వృద్యాపం వచ్చే కొద్దీ కథలను తగ్గించి అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ఆంధ్రదేశ హరికథా పితామను డనిపించుకున్నారు. 1945 వ సంవత్సరం జనవరి 2 వ తేదీన మరణించారు.

శిష్యులూ, ప్రశిష్యులూ:

80 సంవత్సరాలు జీవించారు. వీరి శిష్యులైన వారు నారాయణదాసు సాంప్రదాయాన్ని అపారంగా ప్రచారం చేశారు. వీరేగాక, పాణ్యం సీతారామ భాగవతార్,