పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిభామా వేషంలో ధీమా చూపిన మరి కొందరు:

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా కుమార దేవ గ్రామంలో మంచి రాజు వెంకట్రామ రాజు గారనే నియోగి బ్రాహ్మణుడు భామ వేషం ధరించడంలో బహు ప్రశిద్ధుడు. వారి శిష్యులైన పల్లంపట్ల రామయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా బందపురం లోని పిచ్చుకుంట్ల వారికి భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ నేర్పారు. బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగము, దేశి లక్ష్మి నారాయణ మొదలైన

TeluguVariJanapadaKalarupalu.djvu

వారు భామ వేష ధారణలో సిద్ధ హస్తులు. 16 సంవత్సరాల వయస్సులోనే లక్ష్మీనారాయణ భామ వేషం అద్భుతంగా వుండేదట. బందపురం లో పిచ్చు కుంట్ల వారికి ఈ విద్యను నేర్పించటంలో విశేష కృషి సల్పినవారు పి.ఎస్.ఆర్ అప్పారావు గారు పితృపాదులైన పోణంగి రామమూర్తి గారు.

TeluguVariJanapadaKalarupalu.djvu