పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమ్మత్తుల గారడీ విద్యలు


ఈనాటికీ ఆంధ్రదేశంలో గారడీ వేషాలను, కత్తుల గారడీలనూ చూస్తూనె వున్నాం. గారడి విద్యను సంస్కృతంలో ఇంద్రజాలమనీ, గారడీ వాళ్ళను ఇంద్ర జాలికులనీ వ్వవహరిస్తారు. ఈ గారడీ విద్య పూర్య కాలం నుండీ నేటివరకూ ప్రచారంలో వుంది. పూర్వం రాజాస్థానాలలో విరివిగా ఈ విద్యను ప్రదర్శించి అఖండమైన సన్మానాలను పొందే వారు. ఈ నాటికీ గ్రామాలలో ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు.

మాయదారి విద్యలు:

వేపాకులు దూసి తేళ్ళను తెప్పించటం, అరచేతిలో రూపాయలు సృష్టించడము, అప్పటి కప్పుడు మామిడి టెంకను పాతి మొక్కను మొలిపించటం, మనిషిని బుట్టలో పెట్టి మాయం చేయటం ... గొంతును కోసి రక్తం చూపించటం,మనవద్ద నున్న వస్తువును మాయం చేసి మరొకరి జేబులో నుండి తెప్పించటం మొదలైన అనేక విచిత్రాలను చూస్తూనే వున్నాం. ఈ గారడీ విద్య పూర్వం నుంచీ ప్రచారంలో వుందనటానికి మన ప్రాచీన గ్రంథాల నుండి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. గారడీ విద్యల్ని గూర్చి పండితారాధ్య చరిత్రలో__

నావి యద్గతి బశులాడెడు నట్టి
భావన మ్రోకులపై నాడెడు వారు.

అని వుంది దొమ్మరసానులు గడలపై ఆడినట్లే గారడీ వారు మ్రోకులపై ఆడినట్లు పై రెండు పదాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

అంతరిక్షంలో వింత విద్యలు

పొడవైన మ్రోకును ఆకాశంలోకి విసరగానే అది వెదురు గడలా నిలుస్తుందా తరువాత గారడీ వాడు త్రాడు మీద నిచ్చెన ఎక్కినట్లు జర జరా ఆకాశంలోకి