పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాగా, చుట్టి నల్లని ముఖంమీద ఎర్రని కుంకంబొట్టు పెట్టి, మెడలో తాయత్తు కట్టి, కట్టు పంచను పైకి ఎగకట్టి, డప్పు వాయిస్తూ __తాలె విల్లియ్యలోయ్. రామా రాఘవ విల్లియ్యలోయ్, ఊరికి వెలుపల వున్నామండోయ్. ఊర పందిని తిన్నామండోయి. తాలే విల్లియల్లోయ్, శివాతాలే విల్లియల్లోయ్ అని పాడుతూ, దానికి అనుగుణంగా గంతులు

సున్నపు వీరయ్య చాటింపు వేషం

వేస్తూ, వేదాలను గురించీ, జాతులను గురించీ, అంటరాని తనాన్ని గూర్చీ, కులాల గురించీ, పాటల్లోనూ, మాటల్లోనూ విమర్శనాత్మకంగా చెపుతూ, విన్న ప్రతివారినీ ఆలోచింప చేస్తాడు. అంటరాని తనాన్ని గురించి ఈ విధంగా పాడుతాడు.

అంటరాని తనం పాట:

కుక్కని కోతిని కొల్చుతారయా
నందిని పందిని పూజ సేతురూ