పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పద్యం

అమరంగ స్ఫుట భక్తి నాటకము భాషాంగ క్రియాంగాభి, ర
మ్యముగా జూపిన మెచ్చి మీరలుపురేయన్నంతకున్‌యో నిగే
హములన్ రూపులు పన్నుకొంచును నటుండై వచ్చి సంసార రం
గములోనన్ బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా.

(సర్వేశ్వర శతం. 20 వ పేజి)

నాటకాలు బహురూపాలని పాల్కురుకి సోమనాథుడు కూడా (బసవ పురాణంలో) వివరించాడు.

అటుగాక సాంగభాషాంగ క్రియాంగ
పటునాటకంబుల నటియించువారు.

బహురూపాలంటే ఒకే వ్వక్తి వివిధ పాత్రల్ని ధరించటం. అవి పగటి వేషాలు కావచ్చు. పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో సోమనాథుడు.

ప్రమథ పురాతనవటు చరిత్రములు - గ్రమమొంద బహునాటకము లాడువారు
లలితాంగరస కళాలంకార రేఖ - లలవడ బహురూప మాడేడి వారు.

శ్రీశైలంలో శివరాత్రి పుత్సవాలలో ఈ నాటకాలను ప్రదర్శించే వారు, ఆనాడు ఈ రూపకాలకు ఎక్కువ ప్రచార మున్నట్లు సోమనాథుని పండితారాధ్య చరిత్ర వల్ల తెలుస్తూ వుంది.

జానపద గాధలతో రాజకీయాలను సాధించిన జాణ:

శివాజీకి సింహగడ విజయాన్ని చేకూర్చిన వాడు 'తానాజీ మాల్ సురే '. తానాజీ, మరి కొందరు మరాఠీ సైనికులూ పవాదాగాయకుల వేషాలతో కోటలో ప్రవేశించి దానిని జయించారు. జానపథ గాథల పద్దతిని రాజకీయాలకు ఉపయోగించిన వారిలో ప్రథముడు తానాజీ.