Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శైలికి సంబంధించింది. తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడ మంటారు ఉమా వైజయంతీమాల గారు.

లయ విన్యాసాన్ని తెలియజేసే నృత్తమే గాక, భావ ప్రకటనకు అనువైన భంగిమ గల నృత్యం, పేరణి ఈనృత్యం. నృత్తంతో ప్రారంభమై ... నృత్యంతో వికశించి అంగికాభినయంతో ముగుస్తుంది.

పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే "పేరిణి శివ తాండవం". ఇది వీరులు చేసిన వీర నాట్యం. భారతీయ నృత్య రీతుల్లో ఎక్కడా ఈ పేరిణి నృత్యం కనిపించదు.

రామప్ప ప్రజ్ఞ:

సంగీతానికి సప్త స్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటువంటి మూలసూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్తవిన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది ఉమా వైజయంతీమాల.

రామకృష్ణ ఉవాచ:

ఇది ఒక అద్భుత ప్రక్రియ అంటారు నటరాజ రామకృష్ణ. నేను శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని గురుముఖంగా అధ్యయనం చేయడం వల్ల ఆ భంగిమల్నీ పరిశీలించి అభ్యసించ గలిగా నంటారు.

ఆ మృదంగ భంగిమల్ని పరిశీలించి అభ్యసించగలిగాను. ఆ మృదంగ ధ్వనుల్ని మార్దంగికునికి నేర్పి వాయింప జేశాను. నేను పేరిణి తాండవాన్ని పునర్మించటానికి ఆ మాతృకలే నాకెంతో సహాయ పడ్డాయి. ప్రతి శబ్దానికి ఉత్పత్తి, పరాకాష్ట. అంతర్దానం అనే మూడు దశలున్నాయి. ఆ నాదోత్పత్తి, విజృంభణ నిశ్చ