Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరిణి నృత్యకారుడు, రక్తి కలిగించేవారుగా, రూప సంపన్నుడుగా, అందాన్ని భావింప గలవాడుగా, రసానుభావం కలవాడుగా, తాళజ్ఞడుగా, గమకంలో నేర్పరిగా, ధ్వని గల శరీరం కలవాడుగా, మంచి రేఖ గలవాడుగా, వాయిద్యాలను ఎరిగిన వాడుగా వుండాలనీ, అటువంటి వాడే, పేరిణీ నృత్యానికి తగిన వారనీ పై శ్లోకార్థం__ అంటాడు జాయప సేనాని.

తాండవ నృత్యం:

ఈ ఆధారాలు తప్ప, పేరిణిని గురించి మరిన్ని ఆధారాలు దొరకవు. పై వర్ణనను అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ నృత్యం ఎలా వుంటుందో ఊహించవచ్చు. ఆ ఊహతోనే సృజనాత్మకంగా రామకృష్ణగారు, చరిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన ఈ ఉధృత తాండవ నృత్యాన్ని, వ్వయ ప్రయాసలతో తీర్చి దిద్దారు. పేరిణి తాండవ