పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం


పరమ శివుడు పార్వతి ప్రీతి కోసం రజతోత్సవ సమయంలో కైలాస గిరిలో ప్రదర్శించిన తాండవాలలో పేరిణి తాండవము ముఖ్యమైనది.

పేరిణి శివతాండవం వీర నాట్య శైలికి చెందింది. వీరావేశంతో చేసే తాండవమిది. దక్షయజ్ఞం దండకం చదువుతూ నారసాలు పొడుచుకుని, 'శరభ శరభ అశ్శరభ శరభ అంటూ పరవళ్ళు తొక్కుతూ వీరభద్ర పళ్ళేం పట్టి, తాండవం చేసే ఈనాటి వీరముష్టి వారిని ఉదాహరణగా తీసుకుంటే నాటి పేరిణి శైలి ఎటువంటి విశిష్టమైనదో మనకు అర్థమౌతుంది.

ఆంధ్రుల చరిత్రలో అత్యంత సిద్ధిగాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు, క్రీ॥శ॥ 1050 మొదలు 1350 వరకూ దాదాపు మూడు వందల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. అంధ్రడేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్వలమైంది.

రమణీయమైన రామప్ప గుడి.

శిల్పకళా నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా, ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్ కు నలభై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్ర