పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె తృప్తిగా జవాబు చెప్పగానె కొందరు పండితులు ఆమెను ప్రశంచించే వారు. మరి కొంతమంది తృప్తి పడకుండా ఆమెపై మంత్ర తంత్రాలు ప్రయోగించేవారు. అందుచేత ప్రతి నాటకం జట్టులోను ఒక మంత్ర శాస్త్ర వేత్త వుండి ఇటువంటి మంత్ర ప్రయోగాల్ని విఫలీకృతం చేసేవారు.

నాటక ప్రదర్శనానంతరం అందరూ ఆ వేషాలతోనే గ్రామం లోని ప్రతి గడపకూ వెళ్ళి చీరలూ, ధోవతులు దండుకునేవారు. ప్రదర్శనం చూసి ముగ్దులైన గ్రామస్థులు ఎంతో ఆదరంతో వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. ఈ విధంగా వెంకటస్వామి వీథి నాటకాల ప్రదర్శనలతో అరవై సంవత్సరాలు కళాసేవ చేసి ఎనబైవ ఏట తమ్మవరంలో మరణించాడు.

మాల నాటకములు:

కూచిపూడి భాగవతులు వీథి నాటకాలను ఉధృతంగా ప్రదర్శిస్తున్న రోజులలో ఆయా కులాల వారు కూడా వీథి నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అలా యానాదులు, గొల్లలు, చెంచులు నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అలాగే మాలవారు కూడ వీథి నాటకాలను ప్రదర్శించేవారు.అలాంటి నాటకాలను నా చిన్నతనంలో చూశాను బయట వూరి నుండి వచ్చి, ఊరి వెలుపల పందిరి వేసి నాటకాలను ప్రదర్శించేవారు. ఆగ్రజాతులు తప్ప ఇతర కులాల వారందరూ ఆ నాటకాలను తిలకించేవారు.

ముఖ్యంగా వారు రామాయణానికి సంబంధించిన నాటకాలను ఆడేవారు. రాముడు, సీత లక్ష్మణుడు, హనుమంతుడు, మొదలైన పాత్రలు ధరించి నాటకాలాడేవారు.

ఆయా పాత్రలు ధరించే పాత్రలు మాత్రం అంత అందంగా వుండేవి కావు. మాసిపోయిన దుస్తులతో లక్కతో చేసిన రంగుల ఆభరణాలను ధరించే వారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని కీర్తనలు పాడుతూ పాటకు తగిన విధంగ నృత్యం చేస్తూ రంగస్థలం మీడ కలియ తిరిగే వారు. వారి నృత్యానికి అనుగుణంగా తప్పెట్లు తాళాలతో హంగు చేసేవారు. హార్మోనియం హంగుగా వుండేది. వారు పాడే పాటకు తలా తోక వుండేది కాదు. రామాయణ