Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సింగి:

కమస లింటికి నేనే బోతి
వప్పగానే గద్దె సెప్పి
తెచ్చుకొన్న సొమ్ములాకె
వాదులాటేరా సింగా,
గుద్దులాటేరా.

ఇలా, సింగీ, సింగని మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఈ సంవాదం వ్యంగ్యానికి తావిచ్చేదిగా వుంటుంది.

సందాకాడ, నరసింహులు:

ఈ నాటకాన్ని తెల్లవార్లూ ప్రదర్శిస్తారు. నరసింహుని పాత్రను ఇద్దరు వేయటం ఆచారం. వీరిని సందకాడ నరసింహుడు, తెల్లవారుజామున నరసింహుడు అని అంటారు.

ఇద్దరు నరసింహుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇలా ప్రచారంలో వుంది. __ సందకాడ నరసింహుని కథ జరుగుతుండగా, వేషం వేసుకున్న తెల్లవారి నరసింహుడు, ప్రక్కనే వున్న ఎరువు బండిపై నిద్ర పోయాడట. ఇంతలో రైతు వచ్చి బండి కట్టి పొలంలో ఎరువు వదిలాడు. ఎరువుతో క్రిందపడ్డ నరసింహుడు మేల్కొని__వచ్చే చెంచీతా చూడరే, అంటూ పాడేసరికి భయపడిన రైతు వెంటనే వచ్చి, సమాజం వారికి చెప్పగా, అప్పటికే తెల్లవారి నరసింహుని కోసం వెతికి వేసారి, సందకాడ నరసింహుని తోనే నాటకం పూర్తి చేశారని, ఈ నాటి పెద్దలు చెపుతారని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు వారి జానపద నృత్య కళా గ్రంథంలో ఉదహరించారు.

కళాకారులు:

ఇలాంటి బయలు నాటకాలు రాయల సీమ ప్రాంతంలో ఇంకా ప్రదర్శింప బడుతూనే వున్నాయి. ఈ నాటకాల్లో ప్రసిద్ధి చెందిన నటులు సింగి నాయకుడు, మాలచంద్రప్ప__రంభ, __కుమ్మరి నారాయణ __ఊర్వసి _ చాకలి గంగన్న__ నరసింహస్వామి__ కుమ్మరి నారాయణ స్వామి__ ఆదిలక్ష్మి