పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గజ్జె కట్టిన అందరికీ గురువు:

చింతా వెంకటరామయ్యగారు 1860 వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి శివరామయ్య; తల్లి అరుంధతమ్మ. పది సంవత్సరాల ప్రాయంలోనే పాటలో, ఆటలో, హాస్యంలో అనుభవం సంపాదించి, భామవేషపు దరువుల్ని పాడుతూ వుండేవారు. వెంకాటరామయ్యగారి ప్రాతిభా విశేషాలను గనమించి ఏలేశ్వరపు నారాయణప్ప గారు వారి మేళంలో చేర్చుకున్నారు. 12 వ సంవత్సరం లోనే అన్న గారైన వెంకటరత్నం గారి వద్ద నాట్య శిక్షణను ప్రారంభించి 16 సంవత్సరాలకే విశేష నాట్యశాస్త్రానుభవాన్ని సంపాదించారు.

వీరు భాగవతామేళాన్ని 1875 నుండి దాదాపు 1936 వరకూ నిర్వహించారు. ఈనాడు నిర్వహించబడుతున్న వెంకటరామా నట్యమండలి 1875 లో వెంకట రామయ్య గారితో ప్రారంభించపడిందే. కొంతకాలం భాగవతమనే పేరుమీద, భామాకలాపాన్ని ప్రదర్శించారు. ప్రజాభిరుచుల్ని అనుసరించి యక్షగానాలను ప్రవేశపెట్టి, ప్రహ్లద, ఉషాపరిణయం, గయ నాటకము, రుక్మాంగద, రామ నాటకం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం మొదలైన నాటకాలను ప్రదర్శించి ప్రజామన్ననల్ని పొందారు.

ప్రయాణ సౌకర్యాలు లేని ఆనాడు ఆంధ్రదేశపు నాలుగు చెరగులా ఎద్దుల బండ్లలో ప్రయాణం చేసి ప్రదర్శనాలిచ్చి, ఉన్నతాధికారుల వద్దా, సంస్థానాధీశ్వరుల వద్దా పారితోషికాలు పొందారు.

ఆనాటినుండి చనిపోయే వరకూ కూచిపూడిలో గజ్జెకట్టిన ప్రతి కళాకారుడూ ఆయన వద్ద శిష్యరికం చేసినావారే. ప్రాచీనులైన చింతా నారాయణమూర్తి, వెంపటి పరదేశి వేదాంతం చలపతి, చింతా ఆదినారాయణ మొదలైన ప్రముఖులు ఆయన శిష్యులే.

ఆధునికులలో వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తిగార్లు ముఖ్యులు. వేదాంతం రాఘవయ్య గారిని పాత్ర నిర్వహణలో సర్వసమర్థునిగా తయారు చేసి 1934 లో మద్రాసులో గూడవల్లి