పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాతి వహించారు. ఆ మధ్య హైదరాబాదులో జరిగిన సంగీత నాటక అకాడమీ వారి నాట్య సదస్సులో సన్మానించ బడ్డారు. నేటి నటశేఖరుడైన వేదాంతం సత్యనారాయణ శర్మకు గురువులు.

ఆడవేషాల్లో అందెవేసిన మగధీరుడు వేదాంత సత్యనారాయణశర్మ:

ఈ నాటి యువనటుల్లో పేర్కొనదగిన వారు, వేదాంత సత్యనారయణశర్మ గారు. వీరు గొప్ప నటశేఖరులు. సత్యభామ, ఉష, మోహిని మొదలైన స్త్రీ భూమికల్ని ధరించి అనేక విద్వత్సభలలో అనేక పారితోషికాలను పొందడమేకాక కేంద్ర ప్రభుత్వం వారిచే అవార్డును అందుకుని సన్మానించబడ్డారు. నేటి నటుల్లో ప్రముఖుడు.

ఈ తరం రత్నాలు:

వేదాంతం పార్వతీశం
వేదాంతం మల్లికార్జున శర్మ
భాగవతుల రామతారకం
భాగ్వతుల రామకోటయ్య
భాగవతుల యజ్ఞనారాయణశర్మ
పసుమర్తి సీతారామయ్య
పసుమర్తి వేణుగోపాలశర్మ
పసుమర్తి సీతారామ శాస్త్రి
హేమాద్రి చిదంబర దీక్షితులు
చింతా సీతారామాంజనేయులు
యేలేశ్వరపు నాగేంద్ర శర్మ