పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధేంద్ర యోగి నాట్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు.

ఆనాటి నుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాత్య ప్రదర్శనలూ, వారి భాగవతాలూ, వారి పగటి వేషాలూ, విశాలాంధ్ర దేశంలో వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి.

వంశపారంపర్య వారసత్వం:

ఇలా ఆ కళను వంశపారంపర్య విద్యగా చేసి, దానిని నశింపనీయక కాపాడేందుకు కూచిపూడి గడ్డ మీద పుట్టిన ప్రతి బ్రాహ్మణ మగబిడ్డకూ ముక్కులూ చెవులూ కుట్టిస్తారు. కారణం ముక్కులకూ చెవులకూ రంధ్రాలుంటే ఆభరణాలు ధరించడానికి అనువుగా వుంటుండి. అది స్త్రీ పాత్రగానీ, పురుష పాత్ర గానీ రంధ్రాలు వుంచడం అవసరం. అందువల్ల, వయస్సు ముదిరితే రంధ్రాలు వేయడం కష్టం కనుక, ఆ పనిని బాల్యంలోనే ముగిస్తారు. పసిపిల్లలకు విద్యాభ్యాస మెటువంటిదో వారి కీకర్ణవేధమటువంటిది. ముక్కులూ చెవులూ కుట్టించిన తరువాత మరి కాలికి గజ్జె కట్టించి నటరాజు ముందు నాట్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.

పదిహేనవ శతాబ్దికే ప్రబలంగా ప్రఖ్యాతి:

కూచిపూడి భాగవాతులు 15 వ శతాబ్దం నాటికే వారి కళా ప్రదర్శనలను ప్రదర్శిచటంలో ప్రఖ్యాతి వహించారు. ఇందుకు ఆధారం 1502 నాటి మచ్చుపల్లి కైఫీయతే. 16 వ శతాబ్దం చివరి భాగం నుండి ఈ నాటి వరకూ పారిజాతాపహరణాన్ని ప్రదర్శిస్తూ వారు ప్రశంసల్ని అందుకున్నారు.

భామాకలాపంలో శ్రీకృష్ణుడు నాయకుడు. సత్యభామ నాయిక. శ్రీకృష్ణుడు రుక్మిణి యందుంచిన అనురాగం తనపట్ల చూపలేదని, సత్యభామ శ్రీకృష్ణునితో కయ్యమాడి విడిగా వుండి పోయి ఆ వియోగాన్ని మరి భరించ లేక దూతికతో రాయబారం పంపడం, దూతిక సత్యభామ విరహ వేదనను