- తోటబాలకృష్ణ:
శ్రీ లక్ష్మీనిలయ చర్మ చిత్రకళా సంస్థను, కాకినాడ సమీపంలోని చౌదిగ గ్రామంలో స్థాపించి రామాయణ, భారత గాథలను ప్రదర్శిస్తున్నారు. పదిహేను నిముషాల నుండి ఏడు గంటలవరకూ ఏకబిగీన ప్రదర్శనాన్ని ప్రదర్శిచటం వీరి ప్రత్యేకత.
- తోట ధవనేశ్వరరావు:
సామర్ల కోట మండలంలోని మాధవపట్నంలో ధననేశ్వర రావు, శ్రీ హనుమాన్ చర్మ చిత్ర కళా బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ సంస్థకు దర్శకుడుగా వుండి, రామాయణంలోని సుందర కాండ , "అంగద రాయబారం","లక్ష్మణ మూర్ఛ","లవకుశ" , భారతంలోని ఉత్తర గోగ్రహణం, కీచకవధ, పద్మవ్యూహము, శశి రేఖా పరిణయం మొదలైన ఘట్టాలను ప్రదర్శింస్తున్నారు.
- ఎ.త్రినాథ్:
కాకినాడ సమీపంలోని "చౌదిగా" లో త్రినాథ్ శ్రీవాణీ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీకి అధ్యుక్షుడుగా వుండి, భారత దేశమంతటా బొమ్మలాటలను ప్రదర్శిస్తున్నారు.
- తోట నాగభూషణం:
తూర్పుగోదావరి జిల్లా జెల్లావారి పేటకు చెందిన నాగభూషణం, బొమ్మలాట ప్రదర్శనాన్ని సమర్థవంతంగా ప్రదర్శించటమే కాక, రామాయణ, భారత గాథలకు సంబంధించిన, ఘట్టాలకు సంబంధించిన బొమ్మ లన్నిటినీ తయారు చేయ గల నిపుణుడు.
- తోట సింహాచలం:
తూర్పు గోదావరి జిల్లా జెల్లావారి పేటకు చెందిన సింహాచలం_ శ్రీ అన్నపూర్ణ నిలయ చర్మ చిత్ర కళా సంస్థను స్థాపించి, బొమ్మలాట ప్రదర్శనంలో ప్రజా మన్ననల్ని అందుకున్నాడు. రామాయణంలోని పది భాగాలనూ, భారతంలోని పది భాగాలనూ ప్రదర్శించ సమర్థుడు.