పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరెకాపులు, గంధోళీలు:

ఈ బొమ్మలాటలాడే వారిని అరెకాపు లంటారు. ఈ ఆరెకాపులు ఈ నాటిఒకీ మహారాష్ట్ర దేశంలో వున్నారు. అక్కడ వారి పేరు గంధోలీ లంటారు. ఈ నాడు తెలుగు దేశపు బొమ్మలాటల వారందరూ ఒకనాడు మహారాష్ట్రులే. ఈ నాటికీ బొమ్మ లాటలల వారు బయట ఎంత తెలుగు మాట్లాడినా ఇంట్లో మాత్రం మరాఠీ భాషనే మాట్లాడుతూ వుంటారు. అంతేగాక మరాఠీ బొమ్మలాటలో వుండే హాస్య పాత్రధారి గంధోలి గాడికి, మన జుట్టు పోలిగాడికి చాల దగ్గర సంబంధముంది. ఒకే రకమైన హాస్యమూ వేషధారణలో పోలికలూ వున్నాయి.

రకరకాల జాతులు, పేర్లు:

కాని దక్షిణ దేశంలోని బొమ్మలాట ప్రదర్శకులందరూ మహారాష్ట్ర జాతికి సంబంధించిన వారని చెప్పలేము. మైసూరు ప్రాంతంలో వూరు జంగాలు, బొందాయి, మైసూరు సరిహద్దు ప్రాంతాల్లో కుతుబువారు, మధుర, తంజావూరు