పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖర్చుతో కూడుకున్న పని. నలభై సంవత్సరాల క్రితం వరకూ ఈ కట్టెబొమ్మలున్నాయి.

సూత్రక్రీడ:

అయితే మనదేశంలో కొయ్య బొమ్మలాటకు వేల సంవత్సరాల చరిత్ర వుందంటున్నారు ఆర్వీ.యస్. సుందరంగారు. వారి జానపద విజ్ఞానం. 469 పేజీల, సూత్రక్రీడ అనేది అరవై నాలుగు కళల్లో ఒకటనీ, ఇదే కొయ్యబొమ్మలాటనీ కొందరి అభిప్రాయంగా వుంది. కొయ్య బొమ్మలాట లాడించడానికి సూత్రాలు వుంటాయి. అంటే దారాలన్నమాట. దారాలు బొమ్మలకు కట్టి ఆడించడం వల్ల దీనికి సూత్ర క్రీడ అనే పేరు వచ్చి వుండవచ్చు. అది నిజం కూడ. అందుకు నిదర్శనం ఈనాడు తమిళనాడులో "బొమ్మలాటం" అనే ఈ సూత్రక్రీడ అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ బొమ్మలన్నీ కొయ్య బొమ్మలే అని చెప్పలేం. ఇదే ఒకనాడు కొయ్యబొమ్మలుగా ప్రదర్శింపబడి వుండవచ్చు. ఈ నాటికీ రాజస్థాన్ లో "కట్ పుల్లీ" అనే కొయ్యబొమ్మలనే అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

(మైసూరు మ్యూజియం)
సూత్రధారుడు:

కొయ్యబొమ్మలాటలో సూత్రాలుండడం వల్ల ఆ సూత్రాలతో బొమ్మల నాడించే వ్వక్తికి సూత్రధారి అనేపేరు వచ్చింది. దానిని అనుసరించే సంస్కృత నాటకాలలో కథా విధాన్నాన్ని నడిపే వ్వక్తికి సూత్రధారి అని పేరు వచ్చింది. సూత్ర ధారి నాటినుంచి నేటివరకూ ప్రదర్శించే యక్షగానాల్లో, వీథినాటకాల్లో, భాగవతాల్లో, సూత్రధారుడు అత్యధిక ప్రాధాన్యాన్ని వహిస్తున్నాడు.

ఇందుకు ఉదాహరణంగా కన్నడంలో సూత్రద గొంబె యాట (అంటే సూత్రాల బొమ్మలాట) అనే కొయ్యబొమ్మ లాటలు ఈ నాటికీ వున్నాయి. బొమ్మల్ని చిత్ర విచిత్రంగా ఆడించే చాకచక్యం గల కొయ్య బొమ్మలాటల సూత్రధారి తెర వెనుక వుండి బొమ్మలను సూత్రాల సహాయంతో ఆడిస్తూ వుంటాడు. ఆడించే