పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షయంగా వెలుగొందినా యక్షగానం

115


జిల్లాలో వున్న జక్కులవారు కళావంతుల కోవకు చెంది అభినయ కళలో ప్రావీణ్యం సంపాదించారు.

యక్షగానాన్ని గూర్చి బ్రౌణనిఘంటువులో యక్షగానమంటే ఒక విధమైన పాటగానే నిర్వచించబడింది.

అప్పకవి మెప్పులుగొన్న గొప్పతనం:

అప్పకవీయాన్ని వ్రాసిన కాకునూర్యప్ప కవి తన్ను గూర్చి ఈ విధంగా వ్రాసుకున్నాడు.

లలిత కవికల్ప కాఖ్యాన లక్షణంబు
మహిత సాధ్వీ జనౌఘధర్మ ద్విపదయు
అంబికా వాదనామక యక్షగాన
కృతియు జేసితి కాకునూరి కులప్ప

అని అప్పకవి అంతటి వాడు అంబికావాదమనే యక్షగానాన్ని వ్రాశాడు.

అప్పకవీయంలో "అర్థచంద్రికలు" త్రిపుటజంపె, ఆటతాళము, వీన యక్షకాగ ప్రబంధము లతకవచ్చ అని అప్పకవి వ్యాఖ్యానించాడు. అంటే పాటలు గల ఒక ప్రబంధంగానే అప్పకవి అభిప్రాయంగా మనం తెలుసుకోవచ్చు.

వేషధారణలో అందచందాలు:

ఈనాటి యక్షగాన ప్రదర్శనంలో వేష భూషణ అలంకారాల నన్నిటినీ చూస్తూనే వున్నాం. అయితే ఆ నాటి వేషధారణ ఎలా వుండేదో పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.

శిరమున సురమున జెవుల గంఠమున
గరముల గూకటి కాళ్ళ జెల్వార
దవదండలును గనుగవ కదలికలు
సవరంబులును దలశంపు దండలును
భసితంపు బూతపై బరగు వచ్చెనలు
నరరారు చిరు గజ్జియలును నందియలు