అక్షయంగా వెలుగొందిన యక్షగానం
111
కిన్నెరలు పాట పాడుచుండగా, తాళసంఘ ప్రభేదంబుల గతులనే యక్ష కామినులు నాట్యంబు లాడేవారని (రామాభ్యుదయం) లోనూ,
మంగళమస్తు రమానాథ యని, యక్షు వనితలు కర్ణపర్వముగా పాడేవారని (చిత్రభారతం) లోనూ వివరించడాన్ని బట్టి, యక్షులు నృత్యగానాల్లో ప్రజ్ఞావంతులని వెల్లడౌతోంది.
ఇలా నృత్యగానాలలో ప్రజ్ఙావంతులైన యక్షులు సింహళం వదలి దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన జక్కు జాతి వారని పలువురి అభిప్రాయం.
సింహళంలో వాడుక భాష పాళి, సంస్కృత యక్ష శబ్దానికి ప్రాకృతం "ఎక్కులు" తెలుగు తద్భవం "జక్కులు". జక్కుల వారు వలస వచ్చిన వారైనా ఆదిమ వాసులైనా వారు సంగీత నృత్య కళాకారులన్న మాట నిజమంటూ, వీరి పేరనే "జక్కిణి రేకులు" "జక్కిణి దరువు" "జక్కిణి నృత్యం" వెలిశాయని శ్రీనివాస చక్రవర్తి గారు నాట్యకళ సంచికలో వుదహరించారు
నృత్యగానాలలో ప్రజ్ఞావంతులైన యక్షులు జక్కిణి రేకులు, జక్కిణి నృత్యం చేసి నట్లు భామ వేష కథ అనే యక్షగానంలో__
జోకగ గీత వాద్యముల సొంపుగ నింపుగ పంచ
జక్కిణి ప్రాగటమైన నాట్య రసాభాముల వింపించు వేడుకన్.
అనీ
అణునిభమధ్యలాక్రియలు నా పరి భాషలు నొప్ప జిందు
జిక్కిణి, కొరవంజి మేళముల గేళిక సల్పిరి దేవతా నటీ
మణులకు బొమ్మవెట్టు క్రియ మర్తళ తాళ నినాద పద్దతిన్
రణుదురు రత్ననూపుర ఝుణం ఝుణముల్ మెలయం బదాహరతిన్
అనీ కవులు వర్ణించినారు.
అలాగే తంజావూరు ఆంధ్ర నాయకుల దర్బారులో జిక్కిణి నాట్య గోష్టి జరిగేదనీ__