పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
112
జాన పద కళారూపాలు


విజయరాఘవుని ఆస్థానంలో మూర్తి జక్కిణి నృత్యం చేసేదని (రాజగోపాల విలాసంలో ఉదహరించబడింది).


అలాగే, విజయ రాఘవరాయలు కొరవంజి శుభలీల, గుజరాతి, దేశి, చౌపదియు "జిక్కిణి.... నాట్యముల్ హవణించు నవరజ్ఞు" అనీ (ప్రహ్లద చరిత్రలో వ్వవహరించారు.)

అలాగే, తంజావూరు "అన్నదాన" నాటకంలో జక్కుల రంగసాని పదకేళిక పట్టినట్లు వర్ణించాడు. వీరి పేరన "జక్కసాని కుంట్ల, జక్కుల చెఱువు" మొదలైన గ్రామాలు కానవస్తున్నాయి.

పారిజాతాపహరణంలోని "యక్ష గ్రామ వాసవ్యులు" అనే ప్రయోగంవల్ల బ్రాహ్మణ అగ్రహారాల వలెనే జక్కులవారు ప్రత్యేకంగా గ్రామాలు నిర్మించుకున్నారని చెప్పుకోవచ్చు. వీరు ఆంధ్రదేశంలో ముఖ్యంగా గుంటూరు, గోదావరి జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారని, దక్షిణ భారతదేశంలోని "కులాలు - తెగలు" అనే గ్రంథంలో "ఈథర్ట్సన్" ఇలా ఉదహరించాడు. జక్కుల వారు తక్కువ తరగతి వ్వభిచారిణులనీ, బలిజ కులస్థులనీ, మంత్రవేత్తలనీ, నృత్యనాటకారంగోప జీవనులనీ, వీరు ఎక్కువగా కృష్ణా జిల్లా తెనాలి దగ్గర వున్నారనీ, వీరిలో ప్రతి కుటుంబమూ, ఒక బాలికను వ్వభిచార వృత్తికి కేటాయించటం మామూలని తెలియజేశారు.

శిలప్పదికారంలో:

యక్షగాన వాఙ్మయమూ, యక్షగాన ప్రదర్శనాలూ దక్షిణ భారత దేశంలో అతి ప్రాచీన కాలం నుండీ బహుముఖాల విజృంభించాయి. క్రీ॥ శ॥ 7 వ శతాబ్దానికి ముందుగానో, ఆ తరువాతనో తమిళంలో వ్రాయబడిన "శిలప్పదికార" మనే కావ్యంలో నాటకాలను గూర్చీ, నాట్య శాస్త్రానికి సంబందించిన అనేక శాస్త్రీయ విషయాలు ఉదహరింపబడి ఉన్నాయని శ్రీ నేలటూరి వెంకటరమణయ్య తెలియజేశారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

పండితారాధ్య చరిత్రలో:

ఇక పోతే 13 వ శతాబ్దంలో వుద్భవించిన పాల్కురికి సోమనాథుడు దేశి నాటక సాంప్ర