94
జానపద కళారూపాలు
కురవంజి నేర్చిన విద్యలు:
స్తంభన, వశీకరణ, ఆకర్షణ, ఉచ్ఛాటన, విద్వేషణ, వ్యోమగమన, పరకాయ వ్రవేశాది విద్య లెరుంగుదునే యవ్వా, పరమంత్ర, పర యంత్ర, భేదంబు లెరుగుదునే యవ్వా, "అశ్వలక్షణ" "గజలక్షణ" "రత్నలక్షణ" "స్త్రీ లక్షణ" "పురుషలక్షణ" "సాముద్రిక లక్షణంబు" లెరుంగుదునే యవ్వా అంటుంది.
ఉత్తమ ఔషధాలు అమ్మటమే కాకుండా కురవంజి చేతులు చూచి భవిష్యత్తు కూడ చెపుతుంది. తన వేష మహిమవల్ల నైతేనేమి, తన మాటల చమత్కారం వల్ల నైతేనేమి భూత భవిష్యత్ వర్తమానాలను కరతలామలకం చేసుకున్న తన ప్రజ్ఞ వల్ల నైతేనేమి ఈ కురవంజి తెలుగు వాఙ్మయంలోనే కాకుండా ద్రావిడ భాషలన్నిటి లోనూ శాశ్వత స్థానం సంపాదించుకుంది.
తెలుగు ప్రబంధాలలో అక్కడక్కడ కొరవంజి రచనలు కనిపిస్తాయి. కొన్ని యక్షగానాలలో కొరవంజి పాత్రలేదు. కొరవంజి పాత్ర ప్రవేశం గల యక్షగాన రచనకు ...కొరవంజి అనే పేరని (ఆంధ్ర వాఙ్మయ సూచికి తెలియ జేస్తూ వుంది.)
పార్వతీదేవే కొరవంజి:
కొరవంజి కేవలం వినోదం కల్పించడానికి మాత్రమే కాక కథా నిర్వహణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సంస్కృత నాటకాల్లో విదూషకుని మాదిరే, యక్షగానాల్లో వున్న ఈ కొరవంజి తెలుగు కృష్ణలీలలు మొదలైన యక్షగానాల్లో చల్లమ్మే గొల్లది ఈ కొరవంజి లాంటిదే నంటారు. చింతాదీక్షితులు గారు, వారి ప్రజావాఙ్మయంలో, భామాకలాపంలో గొల్లది ఏ విధంగా వేదాంతోపన్యాసం చేసి ప్రజలను ఎలా అలరిస్తుందో ఆ విధంగానే కొన్ని యక్షగానాల్లో కొరవంజి పూర్తిగా వేదాంత బోధే చేస్తుంది.
ఇంతకీ యక్షగానాల్లో వేషం వేసుకునివచ్చే కొరవంజి మామూలు ఎరుకలసాని కాదని పెద్దల నిర్వచనం. పార్వతీ పరమేశ్వరుల విలాసార్థం కిరాతక వేషం ధరించిన విధంగా, పార్వతీదేవే కొరవంజి వేషం ధరించి యక్షగానాల్లో వినోదం కల్పిస్తూ వుంది.