పుట:TeluguSasanalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

తెలుగు శాసనాలు

19.[వరు]]

20.సిదయంబు రెణ్ణు[దెళా]

ఈ శాసనములో 'కాడ్ల(డ=θ)'లో 'θ'అక్షరము నకు తలకట్టు కలదు.చెఱువు,తాఱడ్లకలు అనుపదములలో శకటరేఫ ము కలదు.'ఱ'చనవరు'లో 'ఱ'అక్షరము కలదు.

'అరిభాలవ్ర్యేంగు'లోను 'భరనాసియు'లోను 'భ' వర్ణము కలదు.వేరే మహాప్రాణములు లేవు.'ఏడ్లకాలు'లో 'ఏ'అను అక్షరము పై దీర్ఘము ను కూడ కలిగియున్నది.ఎ,ఏ,ల భేదము అప్పటి వ్రాతలో కనుపించ దు.ఱాతిలో నేదైన పగులుండుటచే నట్లున్నదేమో.

దీనిలోని విషయమును ఈ క్రింది వాక్యములుగ విభజింపవచ్చును.

  1. కాండ్ల(Da=θ)వ్ర్యేంగులకొడుకు అయుతాణ్ణ అరిభాల వ్ర్యేంగు వేళ్పు చెఱువున పాఱళ్కిమి ప్రశాదఞచ్సె.ఇచట 'పా[జ]ళ్కిమి ' అను పద ము క్రొత్తది.'పన్నస' కు వలె భూమిదానమని అర్థమిచట సరిపోవును.'జ 'అక్షరము స్పష్టముగ లేదు గణుక ఈ పదము సందేహముతో గూడి యున్నది.
  1. వరాసమి భోళ శివకొమరెయకు చన్ద్రాదిత్య కాలంబునకు నిల్పిరి.ప్రతిగ్రహీత పేరు ఆ వాశ్క్యములో చెప్పబడెను.'వరాసమి' ఆయన ఊదిపేరగునేమో.'భోళశివ'అనునది తండ్రి పేరుకావచ్చును.'కొమరెయ'ఆయనపేరు.
  2. సళనంబిచిరి-శాసనమిచ్చిరి
  3. దీనికి

సాక్షులు:చేంగాలు,ఎన్ముళకాలు,ఏడ్లకాలు,మేషికొణ్డు,తాఱడ్లకాలు అని ఐదుగురు.

  1. కొదపునూఱవెట్టు రాజమానంబున నల్పది మఱుతుడ్లు ఇచ్చిరి."ఊరు' గ్రామమనే పదములో సాధురేఫమే కలదు.కాని యిచట శకట రేఫమున్నది. ఊదు(దు పైన చకారమున్నది) అనునది ఊదు,ఊఱు,అనిరెండు విధములుగను మారుటకూθ'యొక్క విలక్షణోచ్చారణమే కారణము. కొదవు