పుట:TeluguSasanalu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేల్పుచెర్ల శాసనము

35

నూరులో కొలుచు రాజమానమో నల్పది మఱుతుర్ల భూమి యిచ్చిరని ఈ వాక్యమున కర్థము.

6.నేలనిల్పిన వారికి అశ్వమేధంబున ఫలంబు- ఫలశృతి.

7.వక్రంబు వచువాన్డు(డ=θ) వేగవిలళు, వేగంగియలు భరనాసి యుఱచి నవారు - అవి చెఱచువారికి పాపఫలము.భరవాసియు అనగా వారణాసి యందు అని అర్థము.ప్రథమాంతమునకు 'ఉ'ప్రత్యయం చేర్చి యడాగమము చేయబడింది. కట్టింఛిన గుడియు, చేసిన పనియు, ఇచ్చిన స్తితియు మున్నగు ప్రయోగములు ప్రథమైక వచనంలో శాసనాలలో వచ్చుచుండును.

8.సిద్ధాయంబు రెణ్డు[- -]—ఆభూమిపై విధించు పన్ను.సాధారణముగ 'పన్నస' గనిచ్చు భూములపై పన్ను విధించరు.కనుక 'పాజళ్కిమి'అని మొదటి వాక్యములోని సందిగ్ధపదమేదో దానభేదమను తెలుపునది గా వచ్చును. దీనికి పన్ను కూడ విధించబడెను.

మొదటి వాక్యములో 'క్రాడ్ల(డ్=θ)వ్ర్యేంగు కొడుకు అయితాణ్ణ అరిభాల వ్ర్యేంగు' అనుదానిలో తండ్రికొడుకు లిద్దరు పేర్కొనబడినట్లు తెలియుచున్నది. వ్ర్యేంగు పదము ఇద్దరి పేర్లకు తుదియందున్నది గనుక దానిని వారి అధికార వాచక మన వచ్చును.గోకర్ణచోడుని కొడుకు ఉదయచోడుడు అనునపుడు చోడ శబ్దమువలె వ్ర్యేంగు అనునది వారి వంశనామమైనను కావచ్చును.కాని ప్రసిద్ధ వంశములలో నట్టి పేరు లేదు.కనుక 'రట్టడి'వలె'వ్ర్యేంగు'కూడ నొక గ్రామాధికారి వంటిఉద్యోగిగా గ్రహించిన బాగుండును.తండ్రి,కొడుకుల కా యధికారము వంశ క్రమమున సంక్రమించినది కావచ్చును.'వేఁగు'అనుపదము అరసున్న గలిగి తపించు అను అర్థమును కలిగి యున్నది.అరసున్న లేని పదము చారుడు, దూత అను నర్థమును కలిగియున్నది. కాని పాక్షికంగా దీనికి కూడ అరసున్న కలదని శబ్దరత్నాకరములో చెప్పబడినది.కనుక'వ్ర్యేంగు'అనగా 'దూత ' అను నొక రాజకీయాధికారి.తలారివంటి ఉద్యోగి కావచ్చును.ఇప్పుడిక తండ్రిపేరు కాడ్ల (డ=θ)వ్ర్యేంగు అనియు, కొడుకు అయితాణ్ణ వ్ర్యేంగు అనియు చెప్ప వలెను.వీటిలో కొడుకు పేరు విలక్షణముగా కనిపించును.అయితాణ్ణ అనేది మాత్రమే పేరు కావచ్చును.