పుట:TeluguSasanalu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగుట గమనించదగిన విషయము. కనుక దక్షిణ భారతమున సంస్కృత-ప్రాకృత-ద్రావిడ సమ్మిశ్రమము నుండి వెలువడిన ప్రాంతీయ భాషలలో కన్నడము కంటె తెలుగు ఆర్వాచీనమై యున్నది. అప్పటి శాసనములను పరిశీలించుచో తెలుగు భాషలో గల అక్షర విశేషములు, పద విశేషములు, వాక్య రచనావిధానము, సంధి, సమాస, కారక, విభక్తి, మున్నగు వ్యాకరణాంశములే కాక ఉచ్చారణ సౌలభ్యమునకైన యితర మార్పులు అనేకము గోచరించును. అందు అక్షరములను గూర్చి తెలిసికొందము.

అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనిమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞ,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,స,హ,ళ. వర్ణములు వాడుకయందుండెను. కాగా ముఖ్యముగ గమనించవలసిన యక్షరములు మరికొన్ని ఆనాటి తెలుగులో కానవచ్చును. అందు శకట రేఫము ఒకటి. ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవుచున్నది. సుమారు క్రీస్తు పదవశతాబ్ద్యంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాషించువఱకు శాసనములందు 'ఴ' అను రూపమున వ్రాయబడు అక్షరముండెడిది. ఇది బండి 'ఱ' లోని అడ్డు గీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అది క్రమముగా కొన్నిచోట్ల 'డ' గాను, కొన్ని చోట్ల 'ళ' గాను, మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి. ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లున్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగ శాసనములను బట్టి తెలియుచున్నది. అది 'చోఴ' పదములలో 'చోడ' లేక 'చోళ' అనియు; 'నోఴంబ' పదములో 'నోళంబ' అనియు, ఴెందలూరు అనుచోట దెందులూరు గాను, క్ఴిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'క్ఴొచె' అనుపదము 'క్రొచ్చె'; వ్ఴచె అనునది 'వ్రచ్చె' అనియు మార్పునొందెను. ఈ యక్షరము