పుట:TeluguSasanalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదములలో వాడబడుచున్నదని కొందరు భావించెదరు. తెలుగు శాసనములలో చొఴ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది.[1] కనుక 'ఴ' అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.

ఇంకొక యక్షరము θ లేక ద[2].ఇది దంత్య 'థ'కారముగాదు.పై జెప్పిన 'ఱ'కంటె రెండు మూడు సటాబ్దులపూర్వమే యిది సాసనములందు సైతము ఉపయోగమునుండి తొలగెను. నన్నయభట్టు నాటికే యిదిభాషలో లేదు.సంయుక్తాక్షరములలో 'నణ'లోకలసి యుండెడిది. న్ద,ణ్ద, మూన్దు: చాండద్లాకు,చదు(మూడు,చాణ్డాలురకు)చెడు) మున్నగు పదములలో కాన నగును. కలమళ్ళ శాసనములో 'ధనంజయుదు రేవాణ్డు,ఏళన్ చిఱుంబూరి రేవణకాలు..." అని దు,ఱు లు రెండు వ్రాయబడియుండుటనుబట్టి θ, ఱులు భిన్నాక్షరములవలెను అట్లే రామేశ్వరము(ప్రొద్దుటూరు) శసనమొకదానిలో ఱ,ఱ,θ ,డ,ళ,లు స్పష్టముగా వ్రాయబడియున్నవి గనుక నవి యన్నియు భిన్నాక్షరములే యగును.పై జెప్పిన 'ధనంజయుదు'క్రమముగా ణ్దు,ండు,ఁడు,డు, అనే ప్రథామా విభక్తి ప్రత్యయమైనది అట్లే _ అనేది,వాణ్డు,వాండు,వాఁడు, వాడు అని ఏకవచనరూపములు 'వాణ్ర్డు '-'వారు 'అనే బహువచనరుపములు పొందినట్లు చెప్పినను,కలమళ్ళ శాసనములోని 'ధనంజయుదు ' అనేది ధనంజయురు ' అని బహువచన రూపమో లేక ధనంజయుడు ' అని ఏక వచన రూపమో

  1. E.I.XVII P.274 11 7-8
  2. తెలుగు లిపిలో ఇపుడు కనబడని ఈ అక్షరము. ఇకముందు ఆకారము తప్ప తక్కిన అచ్చులు కలపవలసివచ్చినపుడు. ద పైన ౨ అని ముద్రింపబడ గలదు.అటులకాక అకారాంత అక్షరముగ వచ్చినప్పుడును సంయుక్తమున వత్తుగ వచ్చినపుడును &theta అని ముద్రింపబడగలదు. పాఠకులు దీనిని గమనింపవలెను.