Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

తెలుఁగు జాతీయములు

ఆచూకి
జాడ
ఆజోలి త్రవ్వ నేల ?
ఆవిషయమును గుఱించిన ప్రస్తావన యెందుకు?
దానిని స్మరించరాదు అనుట.
తే. అనఘ! వేశ్యావిడంబవర్తనము లెన్న
నిసుక పాతఱ యాజోలి యేల త్రవ్వ
నప్పడుపుఁ గూటిపై నసహ్యత జనించి
నామనసు రొసినట్టి చందంబు వినుము.
ఆటవిడుపు
వీధిబడులలో వారము దినముల కొకమాఱు (అష్టమి,
అమావాస్య, పూర్ణిమ మున్నగు తిథులు) విశ్రాంతికై
సెల వొసంగు నలవాటు గలదు. దానిని ఆటవిడుపు
అందురు. అనఁగా_వరుసగ ఏడెనిమిది దినములు కష్టించి
చదివిన బాలుర నాట లాడికొనుటకై ఆరోజున విడిచి
వేయుట అని అర్థము, దీనిని బట్టి పై పదము విశ్రాంతి
దినము, సంతోషదినము మున్నగు నభిప్రాయములఁ
బ్రావర్తిత మగుచున్నది.
సీ. తే. ఊడిగములవారలకు నాటవిడుపు గాఁగ
కువల. 4. 101