Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

29

తొల్ధొల్త సుఖముగ, నుల్లాసముగ నుండి, తుదకు విషమ
ముగ పరిణమించుట అని భావము.
క. అడుకులు తిన్న ట్లగునే
కడుపునఁ గుట్టెత్తినపుడు కడుఁ బఱచితి నాఁ
డొడ లెఱుఁగక పాండుసుతుల
నుడిగి మడుగ వలసె నిప్పు డొక సాత్యకి చేన్ .
భార. ద్రోణ. 4. 89
అడుగు దప్పక
అనినదాని కెదురాడక, శిరసా వహించి
లోఁబడి అని భావము.
'గీచిన గీటు దాఁటక' ఇదియు సమాన భావబోధకములు.

క. పతిభ క్తితోడ జరిపెడు
వ్రతములు వల దనెడునట్టి వనితలు గలరే!
పతిమాట కడుగు దప్పక
సతులకు ననుకూలబుద్ధిఁ జరియింపఁ దగున్.
రుక్మాం. 4. 79.
అడుగు పొడుగు
క్రింద, పైన
ఏమాఱుమూలనైన అని భావము.
ఇది అనుభూత శేషమును సూచించును.
అడుగు పొడు గింకేమైన దొఱకునేమో వెదకిచూడుము.