Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

తెలుఁగు జాతీయములు


తోడు దప్పిన జాడ సిద్ధుండు చనినఁ
గానఁ గాచిన వెన్నెల గాదె బ్రతుకు.
సుదక్షి. 2. 74
ద్వి. చక్కని నాతండ్రి సరి నీకుఁ గలదె
నిను బాయలేనురా నీవెంట నేను
జనుదెంతు భోగంబు చాలు నాబ్రతుకు
నడవిఁ గాచిన వెన్నె లాయె......
సారంగ. 2. 579
ఉ. కామదురాపతాపతతిఁ గ్రాఁగుచుఁ జక్కని కోడెకాఁడెదన్
వేమఱుఁ బ్రేమ ముల్లసిల వేఁడుకొనంగ నసంగ సంగరో
ద్దామవిహారలీలల ముదం బొనరించి కఱంచలేని యా
కామినిసోయగం బడవిఁ గాచిన వెన్నెల గాదె చూడఁగన్.
రసిక . 3. 98
తే. అడవిఁ గాసిన వెన్నెల యయ్యె నాదు
జవ్వనం బక్కుమారుతో సరసలీల
భావజోపభోగంబులఁ బడయనైతి
నీనితాంత తాపంబు నన్నేల సైచు?
మార్కం. 5. 8

అడుకులు తిన్నట్లు

అడుకులు తినునపుడుమాత్ర మేపాటికష్టమును లేక
మధురముగ నుండి, తినినకొలఁది తిన మనసుపుట్టించును.
కాని, అరుగక కడుపులోఁ గుట్టు చేసి వానివలన ననుభ
వింపవలసివచ్చు బాధ దేవుఁడే యెఱుఁగు,