ఈ పుట అచ్చుదిద్దబడ్డది
14
తెలుఁగు జాతీయములు
అక్కఱగండఁడు
శ్రద్ధ గలవాఁడు
ద్వి. కోరిన ధనములు కొండు కొం డనుచు
నక్కఱగండఁ డై యప్పటప్పటికి
వెక్క సంబున నూర్లు వేలు నప్పిచ్చి
హరిశ్చం. 2 భా. 477
అక్కన్న మాదన్నలు
ఒకరి నొక రెడఁబాయక తోడు పడువారు.
(పూర్వము తానీషా యొద్ద మంత్రులుగ నుండిన రామ
దాసు మేనమామ లక్కన్న మాదన్నలు ఒకరి నొకరు
సమర్థించుకొనుచు జంటఁ బాయక ఒకకుత్తికగఁ నుండు
వారఁట.)
అక్షతలు పడు
తథాస్తని యనఁబడు (వివాహ మవు)
అక్షతలు వైచు
తథాస్తను, ఆశీర్వదించు
అందఱు తల కొక యక్షత యా వేదాంతిపై వైచిరి.
సాక్షి, పే. 135.
అక్షరాభ్యాస మొసఁగు
అక్షరములు నేర్పు, (మొదలిటినుండి నేర్పు)