ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
15
సీ. ఇంపు సొంపులు గ్రుమ్మరింపు మాటల వీణ
పలుకుల కక్షరాభ్యాస మొసఁగు
అని. 2. 31
మ. ఆరవిందంబుల కందచందముల వర్ణాభ్యాస మీనోపు
సుందర మాస్యమ్ము సితేతరచ్చవి వివర్ణం బయ్యె;
శుష్కించెఁ బీవర మంగ మ్మఖలమ్ము; తోఁచె భరమై
భాష్యప్రబోధంబ; యేసరి కేదుగ్గతి గల్గునో యను చెదన్
సందేహ ముద్భూతమై,
శ్రీవిద్యా. 4 ఆ.
అక్షింత గింజలు పడు
పీటలపైఁ గూర్చుండియున్నపు డాశీర్వచనపు టక్షతలు
నెత్తిపైఁబడు, (వివాహాదు లగు)
ఎటో ఒకట్లుటు ఆ అక్షతగింజలు పడినవి.
అగపు తగవు
కార్యము, కరామతు (అభము, శుభము)
తే. అది విని చెలంగె మత్సతి యటుల గాదె
యల్లుఁ డని యాడుబి డ్డని యగవు తగవు
లంపకము శుభశోభన మని యి వెల్ల
సంతసముఁ జేయుఁ గన్య కాజసములకును.
దశా. (బల) ఆ. 9. పే. 289
తే. అట్టదక దా వధూటులు కల్గుఁ డంచు
నగవు తగపు లటంచు నెయ్యంబు లంచు