పుట:TellakagitaM.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాకే గనక చేతనైతే

పసిపిల్లల పిప్పర్మెంట్ నౌతా
తీయతీయగ కరిగిపోతా

స్కూలు పిల్లల బ్యాగు నౌతా
పుస్తకాలను మోసిపెడతా

కన్నెపిల్లల కోరికౌతా
కన్నవారి కానుకౌతా

మగపిల్లల మీసమౌతా
తెలుగువాని రోషమౌతా

యుద్ధవీరుని గన్నునౌతా
భరతమాతవెన్నునౌతా
మరుమల్లెల దండనౌతా
దేశభక్తుని దండమౌతా

ఆప్తమిత్రుని దరహాసమౌతా
అనాథకు విలాసమౌతా

ఆర్తురాలికి అన్ననౌతా
నిరుపేదకు అన్నమౌతా

శ్రమజీవికి పాన్పునౌతా
నిండుచూలాలి కాన్పునౌతా

ముసలిఅవ్వకు చేయూతనౌతా
అవసరమైతే కొడుకు నౌతా.

(చిన్నపటి మాట.. ఇప్పటికీ)