పుట:TellakagitaM.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ క్షణం ఇలా ఆగిపోనీ

ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలంతో జతకట్టలేను
నన్ను తనలో పొదుగుకున్న రాత్రి కరిగిపోతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడలో నేకరగలేను
 తెల్లవారితే జీవితం యాంత్రికం
నాలో నేను లేని రోజంతా.. పరిగెత్తలేను
నా నగ్నత్వాన్ని కప్పే నాగరికత ముసుగులో
కృత్రిమ శ్వాసతో బతుకీడ్చలేను
 ఈ క్షణం ఇలా ఆగి పోనీ

నన్ను నాలో చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటి వాకిట్లోని మసక వెలుతురే..
నీకై తపించిన నన్నును నాకు దూరం చేస్తుందన్న దిగులు
 గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
నేను నువ్వైయ్యాకా విచ్చిన వెలుగులో నన్నే నేను పోగొట్టుకున్నా.

నిశీథి పంచే చల్లదనం వలపుల వెచ్చదనాన్ని ఏమార్చనీ
నేనంటూ మిగిలుండాలన్న నీ వీడుకోలు వీలునామా

అనుక్షణం నీకై బతకాల్సిన బాధ్యత
ఎందుకింత కాంక్ష నీకు..!
జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి కానీ
ఈ తిమిర సమరంలో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ

(మనసు నను తొలచినపుడల్లా..)