పుట:TellakagitaM.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొన్ని Tellగు మాటలు

ఉలి రాల్చిన శిలాక్షరాల రజను ఓ యుగాదిన పోగేస్తున్నాడొకడు.
తవ్వకాల పునాదుల్లోంచి అంతర్వాహినిని వెలికితీస్తున్నాడతడు.
ప్లవకాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆత్మబంధాన్ని ప్రోది చేసుకుంటున్నట్టుగా .. తన దోసిలినిండా జవ జవ లాడే తెలుగుదనం జాలువారుతోంది. ఉలి రాతల సమానర్థకమే..
నా మనసు భాషలోకి మారుతుంది.
సమీప గతం ఛాయలా నా తలపుల్లోకి జారుతుంది.
ఆ ఉషోదయపు అన్వేషికి అందిన శకలాల కొన వెలుగుల్లో
చరిత్ర చెక్కిన శిల ముభావమై మసక బారుతోంది.
వాడి మాటల్లోని నిజం.. భాషను మించిన భావమై నిలుస్తోంది.
ముంగిలి రంగవల్లుల్లో ఆహ్వానాల తోరణం ఇంగ్లీషు రూలైనట్టు ఆంధ్రత్వాన్ని హరించింది.. రంగుల పేర్లు భాష మార్చు కున్నాయి. రంగును కలర్ ఆవహించింది. చెక్కిళ్ల పై ఎండిన చారలా చందమామ మూనై వలితిరిగాడు
అమ్మా నాన్నలకు లేని అస్తిత్వం జాబిల్లికెక్కడిది?
విద్యాలయాలు పిడిదీక్షాలయాలవుతున్నప్పుడు
కవితాపాఠం లాంటి చదువు..కంఠోపాఠం అవ్వచ్చు గానీ హృదయగతమౌతుందా!! తినే అన్నం, తాగే నీరు, పీల్చే గాలి, నడిపే వాహనం, రాసే కలం, కాగితం.. మనసు భాష లోంచి రావడం ఇప్పుడో ప్రహసనం. మన మూలాల్లో మనమెంతన్నది ఒక ప్రహేళిక.. ఆసుపత్రులూ.. తువ్వాళ్లు, కుర్చీలతో చిక్కులు లేవు కానీ
పోత పాల పెంపకాలలో పెట్టే పేర్లన్నీ పొల్లుపోనివే..
అజంతంగాఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది.
సాధారణంగా జరిగే కామనే.. లోకం లో నిలవ్ నివ్వనివి
ప్రేమ భావనలు. పొరపాటైనా కాకున్నా.. ప్రతి సారీ నిముష కాలమినిట్టే గడిపినట్టు ఒకే ఒక అవగతం.
జీవితం ఒక పాటైతే అది సాంగోపాంగమే..
అర్థం కాని పదబంధాల గజిబిజి ని
తీరికలేని తనంగా పోగేసిన వాడి కెంత గీర్వాణం!!!
వాడి దోసిలి నిండిన మల్లెల్ని మొనల్లా కన్న నాదెంత చత్వారం!!