పుట:TellakagitaM.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెలుగు చూద్దాం

మేం చూస్తాం.. చూసి తీరతాం
ఏ రోజుకై ఎదురు చూశామో ..ఇంతకాలం మనం!!
65 ఏళ్ల కింద వచ్చినట్టు విన్న రోజుని..
పెద్దల పెదాలపై పదే పదే పలికిన రోజుని..
చీకటి వాకిట్లోకి వెలుగై చిమ్మే రోజుని ..
మేం చూస్తాం.. చూసి తీరతాం
ఇక ఏ రాజకీయ మైనాకమైనా సముద్రంలో దూక వలసిందే.
సగటు మనిషి అడుగుల సవ్వడిలో
మిన్ను ..మన్ను కంపించ వలసిందే
పాలకుల బిరుసు తలల పై పిడిగులు పడే రోజుని
మేం చూస్తాం చూసి తీరతాం
నిజం అంత నిజంగా విజయం .. నిలిచే రోజుని
తరమబడ్డ నమ్మకాన్ని పీఠమెక్కించే రోజుని
ఖద్దరు ముసుగుల లొసుగులు
తొలగి పోయే క్షణాలు .. తారాడే రోజుని
మేం చూస్తాం చూసి తీరతాం.
కోరుకున్న రోజు ఎదురొచ్చినప్పుడు
దారి చూపే సహచరులతో కలసి
మనం కాక మరెవ్వరన్న జవాబు
ఇప్పుడు కాక మరెప్పుడన్న స్ఫూర్తితో నడచి
నాలో నేనై ప్రభవించి..
మానవతై గుబాళించే స్వతంత్ర పుష్పాన్ని
చూస్తాం చూసి తీరతాం.
సామాన్యుడి బతుకు బండి గతుకుల దారి.. పూల బాటైన రోజుని..
రోజువారీ పనిలో అలసట ఆట పాటైన రోజుని..
మేం చూస్తాం చూసి తీరతాం (సహచరులందరికీ..)