పుట:TellakagitaM.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిను చేరాలనే..

నా తలపుల్లో నిలిచి ఉన్నది
నీవైనప్పుడు..
ఎడబాటుకు అర్థమేముంది

ఎద ప్రతిధ్వనించెనా..
అడుగు అడుగులో మెదిలే సవ్వడై..
ఒంటరితనమే నా చిరునామా..
 
పగలైనా రేయైనా నీ ఊహే
నన్ను నాకు వివరించేది ..

నను నిలువరించి వరించేది..
యుగాల విరామంలో క్షణాలు గడుస్తున్నాయి

అంతరంగాల్లో మనోభావాలే
జ్ఞాపకాల కూనిరాగాలై.. నిలుస్తున్నాయి

ఆకాశం చలి కాగుతుంది ..
నా ఊపిరిలో వెచ్చదనానికి
మంచు కరుగుతుంది నీదిక్కున..

నిను జీవితంలా శ్వాసించనీ..
ఈనేలపై
నా అడుగుల తడబాటు..
నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే
ఆవిర్లు విరజిమ్మే ఈ గుండె చప్పుడు..
ఆగేలోగా నిను చేరాలనే.