పుట:Tatwamula vivaramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయినది. దక్షణ భారతములో ఆనాటి జ్ఞానులు ఆధ్యాత్మికమునకు సంబంధించినట్లుగ బ్రహ్మవిద్యను అనుసరించి దేవాలయములు నిర్మించారు. అందువలన శాస్త్రపద్దతిగ ఉన్న దేవాలయములు దక్షణ భారతదేశములోనే కనిపించును. గాలి గోపురము, ధ్వజస్తంభము, ఏడు ద్వారములు, గర్భగుడి ఇవన్నియు దక్షణదేశములోని దేవాలయము లలో కనిపించును. ఉత్తరదేశములో ఆత్మజ్ఞానులు లేకుండిరి కావున అక్కడ దేవాలయములున్నప్పటికి వాటియందు గాలిగోపురముకాని, ధ్వజస్తంభముకాని, ఏడు ద్వారములుకాని, గర్భగుడికాని ఉండవు. దక్షణ దేశములో ఆత్మజ్ఞానులుండెడివారు, ఉత్తరదేశములో విద్వాంసులుండెడి వారు. కావున ఉత్తరదేశములో సంస్కృతము పాండిత్యము, దక్షణములో ఆత్మజ్ఞానము ఇప్పటికి గలవు. ఇప్పటికి శాస్త్రబద్దమైన పురాతన దేవాలయములు దక్షణదేశములో గలవు. కాలక్రమేపి అజ్ఞానము పెరుగుచు పోవుచున్నది, కావున పురాతన దేవాలయముల అర్థము దక్షణదేశములో కూడ తెలియకుండ పోయినది. అందువలన ప్రస్తుత కాలములో దక్షణ దేశములో కూడ తయారగు దేవాలయములు శాస్త్రబద్దత లేకుండ తయారగుచున్నవి.


దక్షణ దేశములోని ఇందువులు పూర్వము పూర్తి జ్ఞానము కల్గి ఉండుట చేత వారు తయారుచేసిన ఆలయములు జ్ఞాన చిహ్నములై ఉండెడివి. అట్లే వారు చెప్పెడి బోధలు పూర్తి జ్ఞానముతో నిండుకొని ఉండెడివి. అదేవిధముగ వారు వ్రాసిన తత్త్వములను పాటలు ఆత్మజ్ఞానముతో మూర్తీభవించి ఉండెడివి. ఇప్పుడు మనము చెప్పుకొను ఈ తత్త్వము పూర్వపు జ్ఞానులచేత వ్రాయబడినది కావున అందులో ఆత్మజ్ఞానముతో కూడుకొన్న వివరములు గలవు. ఇక్కడ "ఏడుకొండలు