పుట:Tatwamula vivaramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడగల విషమునకు తప్పక బాధపడవలసి వస్తున్నది. విషమునకైతే బాధపడవచ్చునుగాని విషయమునకు ఎందుకు బాధపడవలెనని కొందరు అనుకోవచ్చును. దానికి మా వివరమేమనగా విషము అనునది అందరికి తెలిసినదే. ఆహారమునకు విషమును చేర్చితే విష ఆహారమగును. అట్లే పాణీయమునకు విషమును చేర్చితే విష పాణీయమగును. రెండు పదములలోను "విష" అని చెప్పి విషము అని ఎందుకు చెప్పలేదనగ విష అను రెండక్షరములే పూర్తి అర్థమునిచ్చుచున్నవి. ఒక అర్థముతో ూడిన అక్షరములకు పదము సంపూర్ణమగుటకు "ము" అను అక్షరమును కలుపు కొనుచుందుము. అందువలన విష అను అర్థమునిచ్చు రెండక్షరములను పదము చేయుటకు "ము" ను కలిపి విషము అంటున్నాము.


అలాగే యమ బాధలు అను పదములో యమ అను అర్థమునిచ్చు అక్షరమునకు డు కలిపి యముడు అంటున్నాము. నిజానికి ఈ పదము యమడు అని పలుకవలెను కాని యముడు అని పలుకుట అలవాటై పోయినది. విషము వలన యమలోకమునకు చేరవలసిందే అనగ అక్కడ బాధలు అనుభవించవలసిందే. కావున బాధలను చూచించు యముడు అను పదమును హానిని కలుగజేయు విషము అనుపదమును తీసుకొని విష+యము అను వాటిని కలిపితే విషయము అగుచున్నది. విషయము అను పదములో హానికరమైన బాధలు కలుగజేయునదని అర్థము కలదు. మనస్సను పాము ప్రపంచ విషయమును ఐదు విధములుగ కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనువాటి ద్వార తెలియజేయుచున్నది. విషయములోనే హానికరమైన బాధలతో కూడుకొన్న అర్థముండుట వలన ఐదు ఇంద్రియములను ఐదు పాముతలలుగ